AP Politics: ఏపీలో సరికొత్త యాక్షన్ ప్లాన్‎తో దూసుకెళ్తున్న రాజకీయ పార్టీలు.. అప్పటి నుంచే భవిష్యత్ కార్యాచరణ..

ఏపీలో జనం సంక్రాంతి జరుపుకుంటుంటే.. రాజకీయ పార్టీలు పొలిటికల్‌ సంక్రాంతిలో తల మునకలయ్యాయి. పొత్తులు, అభ్యర్థుల లిస్టులు, ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పండుగ తర్వాత ఈ నెల 25వ తేదీ టార్గెట్‌గా అన్ని పార్టీలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక పండుగ తర్వాత నాల్గో లిస్ట్‌ రిలీజ్‌ చేయడానికి అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో ఇన్‌ఛార్జీలను వైసీపీ ప్రకటించింది.

AP Politics: ఏపీలో సరికొత్త యాక్షన్ ప్లాన్‎తో దూసుకెళ్తున్న రాజకీయ పార్టీలు.. అప్పటి నుంచే భవిష్యత్ కార్యాచరణ..
Ap Politics

Updated on: Jan 14, 2024 | 6:48 AM

ఏపీలో జనం సంక్రాంతి జరుపుకుంటుంటే.. రాజకీయ పార్టీలు పొలిటికల్‌ సంక్రాంతిలో తల మునకలయ్యాయి. పొత్తులు, అభ్యర్థుల లిస్టులు, ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పండుగ తర్వాత ఈ నెల 25వ తేదీ టార్గెట్‌గా అన్ని పార్టీలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక పండుగ తర్వాత నాల్గో లిస్ట్‌ రిలీజ్‌ చేయడానికి అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాల్లో ఇన్‌ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. సంక్రాంతి తర్వాత నాలుగో లిస్టు వస్తుందంటున్నారు. అటు ప్రచారంలోనూ స్పీడ్ పెంచేలా ఏపీ సీఎం జగన్‌.. ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు వెళతారు.

26 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి.. లీడర్లు నుంచి కేడర్‌ దాకా అందరిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఈ భేటీలు ఉత్తరాంధ్ర నుంచే మొదలు కానున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్‌ కేడర్‌ సమావేశాలు మొదలు కానున్నాయి. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఇక సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్‌ సమావేశాలు జరగనున్నాయి. నాలుగు నుంచి ఆరు జిల్లాల కేడర్‌లతో ఒకే సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌.

మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ వేగవంతమైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో.. మేనిఫెస్టో ఫైనల్ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఉండవల్లిలో డిన్నర్‌ భేటీ జరిపిన చంద్రబాబు, పవన్‌.. ఇతర పార్టీల నేతల చేరిక పైనా చర్చించారు. టీడీపీ, జనసేన కలిసి తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. పండుగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రెండున్నరేళ్లు పవన్‌ సీఎం పదవిని చేపట్టాలని సీనియర్‌ నేత హరి రామ జోగయ్య సూచించారు. పవర్ షేరింగ్‌ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సీఎంగా పవన్‌ని ప్రతిపాదించే అంశం ప్రజల్లోకి వెళితేనే, టీడీపీ-జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని చేగొండి కీలక సూచనలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఎన్నికలకు పొత్తులో భాగంగా వెళ్లినా, ఒంటరిగా వెళ్లినా ఏపీలో తాము ఎదగాలని, బలమైన నాయకులను తయారు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఈనెల 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన తరువాత రాజకీయంగా మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని.. అదే టైమ్‌లో తమకు రోడ్‌మ్యాప్ రావొచ్చని ఏపీ బీజేపీ భావిస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లు.. అంటే టోటల్ ఏపీలో పోటీకి అభ్యర్థుల్ని నిలబెట్టడమే టార్గెట్. ప్రతి లోక్‌సభ సెగ్మెంటుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి.. ప్రతి నియోజకవర్గంలో దరఖాస్తులు తీసుకునేలా ఆ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు తెలంగాణ ఫార్ములాతో ముందడుగు వేస్తోంది కాషాయ పార్టీ.

మరోవైపు ఏపీ కాంగ్రెస్‌ కూడా కొత్త వ్యూహాలతో ముందుకు కదులుతోంది. వైసీపీ, టీడీపీ అసంతృప్త నేతలపై ఫోకస్‌ పెంచింది హస్తం పార్టీ. చాలామంది తాజా, మాజీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు. పండుగ తర్వాత పెను మార్పులు చూస్తారని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఈ నెల 17న అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తామంటున్న గిడుగు.. పొత్తుల వ్యూహాన్ని కూడా సిద్ధం చేశామంటున్నారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు ఆయన. ఏపీలో అన్ని పొలిటికల్‌ పార్టీలు ఈ నెల 25వ తేదీ టార్గెట్‌గా పొలిటికల్ వ్యూహాలు రచిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..