Vijayawada: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్రమత్తమైన పోలీసులు ఏం చేశారంటే

విజయవాడలో(Vijayawada) కలకలం రేగింది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్టాండు అవుట్‌గేట్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు...

Vijayawada: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్రమత్తమైన పోలీసులు ఏం చేశారంటే
Suicide

Updated on: Apr 25, 2022 | 12:03 PM

విజయవాడలో(Vijayawada) కలకలం రేగింది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్టాండు అవుట్‌గేట్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న కృష్ణలంక(Krishna Lanka) పోలీసులు వెంటనే స్పందించారు. బాధితులతో ఉప్పు నీరు తాగించి పురుగుల మందు కక్కించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అప్పులు ఎక్కువ అవడం, డబ్బులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. దీంతో వెంకటేశ్వరావు.. తన భార్య రాధారాణి, కుమార్తెలు భావన, శ్రావణిలతో కలిసి గత నెల విజయవాడకు వచ్చారు. అప్పటి నుంచి లాడ్జిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక నలుగురూ ఆత్మహత్యకు యత్నించారు.

చనిపోయేముందు.. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామన్న విషయాన్ని కుటుంబసభ్యుల్లో ఒకరికి తెలిపారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్యులు వెంటనే స్పందించి లాడ్జి వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న నలుగురిని కాపాడారు. ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

MIM: టార్గెట్ 2024.. ఆ నియోజకవర్గాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ నజర్.. కార్యకర్తలతో భేటీ