Tirupati: అర్ధరాత్రి వేళ మామిడి తోటలో అరుపులు.. కేకలు.. తీరా చూస్తే షాక్!

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గుప్త నిధుల కోసం చేసిన పూజలు కలకలం రేపాయి. మల్లయ్యపల్లి గ్రామ పరిసరాల్లో రెండ్రోజుల క్రితం ఈ తతంగం వెలుగు చూసింది. గతంలోనూ క్షుద్ర పూజలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన నేర చరిత్ర ఉన్న మల్లయ్యపల్లికి చెందిన ధనలక్ష్మి యవ్వారం మరోసారి ఇలాంటి పూజలతో బయటపడింది.

Tirupati: అర్ధరాత్రి వేళ మామిడి తోటలో అరుపులు.. కేకలు.. తీరా చూస్తే షాక్!
Pujas For Hidden Treasures

Edited By:

Updated on: Mar 08, 2025 | 9:18 PM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గుప్త నిధుల కోసం చేసిన పూజలు కలకలం రేపాయి. మల్లయ్యపల్లి గ్రామ పరిసరాల్లో రెండ్రోజుల క్రితం ఈ తతంగం వెలుగు చూసింది. గతంలోనూ క్షుద్ర పూజలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన నేర చరిత్ర ఉన్న మల్లయ్యపల్లికి చెందిన ధనలక్ష్మి యవ్వారం మరోసారి ఇలాంటి పూజలతో బయటపడింది.

గుప్తనిధుల తవ్వకాల కోసం చేసిన ధనలక్ష్మి చేసిన హడావుడి కాస్తా అరుపులతో బయట పడింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మామిడి తోటలో వినిపించిన అరుపులకు భయపడి అక్కడికి వెళ్లి చూసిన రైతులు పూజలు చేస్తున్న ధనలక్ష్మి బండారాన్ని బయట పెట్టారు. మామిడి తోటలో తవ్విన గుంత, అక్కడే ఒక రాయికి చేసిన పూజలు, పసుపు కుంకుమ, ముగ్గులు, కర్పూర హారతులు, ఎగిసిపడ్డ మంటలను చూసి బిత్తరపోయిన రైతులు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హుటాహుటీన అక్కడి వెళ్లిన చంద్రగిరి పోలీసులు కూడా అక్కడ అర్ధరాత్రి సమయంలో మంటలను చూసి భయపడ్డారు. ఆరా తీయడంతో ధనలక్ష్మి యవ్వారం కాస్తా బయటపడింది. గుప్త నిధుల కోసం చేసిన పూజలు, అరుపులతో దైవ శక్తిని ఆవహించుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఆరా తీసి ధనలక్ష్మిని నిలదీశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇదంతా చేసిన ధనలక్ష్మి తన పొలంలో తానేమైనా చేసుకుంటే మీరెవరంటూ గద్దించే ప్రయత్నం చేసింది. పోలీసుల ముందే స్థానిక రైతులపై ఆగ్రహంతో ఊగి పోయింది.

మంత్రగాళ్లతో కలిసి పూజలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి విచారించిన చంద్రగిరి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి మంత్రగాళ్లను సైతం విచారించిన పోలీసులు అసలు నిజానికి బయటపెట్టే ప్రయత్నం చేశారు. నాగాలమ్మ దేవతకు పూజలు చేస్తున్నామని బుకాయించే ప్రయత్నం చేసిన ధనలక్ష్మిని పోలీసులు తమదైన స్టైల్ లో విచారిస్తే, వివరాలు బయటకొచ్చాయి. శాంతి పూజలు చేసేందుకు వచ్చామని బుకాయించిన మంత్రగాళ్లను సైతం అదే రీతిలో విచారించిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.

గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలను గుర్తించిన పోలీసులు ధనలక్ష్మికి, మంత్ర గాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తమకే పాపం తెలియదని శాంతి హోమ చేయడానికి వచ్చామన్న మంత్రగాళ్ళు పోలీసుల కాళ్ళ వెళ్లా పడటంతో వదిలి పెట్టగా, ధనలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చి మల్లయ్యపల్లి నుంచి సాగనంపారు. దీంతో ధనలక్ష్మి సొంతూరును వదిలి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..