Andhra Pradesh: మహిమాన్విత నాణెం అంటూ నమ్మబలికారు.. ఆ తరువాత పోలాల్లో పడి దొర్లుతూ..

Rice Pulling: విజయనగరం ఎస్‌కోట లో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ కలకలం సృష్టించింది. మహిమ గల నాణెం అంటూ కొందరు వ్యక్తులు హైదరాబాద్ యువకులను మోసం చేసే ప్రయత్నం చేశారు.

Andhra Pradesh: మహిమాన్విత నాణెం అంటూ నమ్మబలికారు.. ఆ తరువాత పోలాల్లో పడి దొర్లుతూ..
Rice Pulling

Updated on: Nov 10, 2021 | 12:30 PM

Rice Pulling: విజయనగరం ఎస్‌కోట లో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ కలకలం సృష్టించింది. మహిమ గల నాణెం అంటూ కొందరు వ్యక్తులు హైదరాబాద్ యువకులను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకుని పొలాల వెంట పరుగులు పెట్టారు. అనుమానం వచ్చిన రైతులు ఓ యువకుడిని దొరకబట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా.. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే విజయనగరానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు తమ వద్ద మహిమ గల నాణెం ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులను నమ్మబలికారు. ఆ నాణెం విక్రయించేందుకు రూ. 5 లక్షల బేరం కూడా కుదుర్చుకున్నారు.

ఈ క్రమంలోనే మహిమ గల నాణేన్ని కొనుగోలు చేసేందుకు ముగ్గురు హైదరాబాద్ యువకులు ఎస్ కోటకు వచ్చారు. ఇద్దరు గిరిజన యువకులతో బేరసారాలు జరిపారు. నాణెం కోసం రూ. 5 లక్షలు గిరిజన యువకులకు ఇచ్చారు హైదరాబాద్ యువకులు. రూ. 5 లక్షలు తీసుకున్న గిరిజన యువకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. పొలాల వెంట పడుతూ లేస్తూ పరుగెత్తుతుండటంతో స్థానికులు అనుమానంతో వెంబడించి పట్టుకున్నారు. ఒకరు చిక్కగా.. మరొకరు తప్పించుకున్నారు. దొరికిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నకిలీ నాణెం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Hyderabad : బీ అలర్ట్.. అలాంటి మాంసాన్నే కొనుగోలు చేయండి.. అధికారుల కీలక సూచన..

Watch Video: వీడు మాములోడు కాదు.. చూసినట్లే చూసి గుడిలో హుండీని తవ్వుకెళ్లాడు..

Viral Video: మానవత్వం చాటుకున్న వాహనదారుడు.. దేవాంగపిల్లి రియాక్షన్ చూస్తే కంట కనీళ్లు ఆగవు..