PM Modi in Visakha: రూ.2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం..!

|

Jan 08, 2025 | 7:23 PM

1200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును గంగవరం పోర్టు సమీపంలో దాదాపు 1200 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీని ఖరీదు రూ. 1.85 లక్షల కోట్లు. దీని ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయనున్నారు. దీంతో మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాన మోదీ శ్రీకారం చుట్టారు.

PM Modi in Visakha: రూ.2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం..!
Pm Modi In Visakha
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వరకు రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ స్థానికులు ఘనస్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ర్యాలీ అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మా ధ్యేయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనేది మా సంకల్పమన్నారు.

2024లో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రూ.2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా పూడిమడ్కలో నిర్మిస్తున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కింద 300 ఎకరాల్లో 25 పారిశ్రామిక తయారీ యూనిట్లు నిర్మించనున్నారు. దీంతో పాటు రోడ్లు, పారిశ్రామిక కేంద్రం, పోర్టు, కెమికల్ స్టోరేజీ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

1200 ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును గంగవరం పోర్టు సమీపంలో దాదాపు 1200 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీని ఖరీదు రూ.1.85 లక్షల కోట్లు. దీని ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ మరియు యూరియాతో సహా ఆకుపచ్చ రసాయనాలు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం:

రూ.1518 కోట్లతో 2500 ఎకరాల స్థలంలో నిర్మించిన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రధాని ప్రారంభించారు. దీంతో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

నక్కపల్లిలో రూ.1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 2002 ఎకరాల స్థలంలో రూ.1,1542 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. దీని వల్ల 54 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కింద గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని నిర్మించనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో రూ.1,0500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.

రూ.19,500 కోట్ల వ్యయంతో రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

గుంటూరు, బీబీనగర్‌, గూటి, పెండేకల్లు మధ్య రైల్వే డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు.

 మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..