
ఏపీ పర్యటనలో భాగంగా కర్నూలులోని ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్రం మోదీ. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాని మోదీ హెలికాప్టర్ శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా శ్రీశైలం క్షేత్రానికి వచ్చారు.
On behalf of my people of Andhra Pradesh, I warmly welcome our Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, to our state. pic.twitter.com/uaYSKnXZ6R
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2025
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్ధానంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సుమారు 50 నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. 12 గంటల 5 నిమిషాల వరకు శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మోదీ ఉండనున్నారు.
ఆనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రధాని మోదీ సందర్శిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 15 నిమిషాల పాటు ప్రధానమంత్రి ధ్యానం చేయనున్నారు. ఇంతకు శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రాధాన్యత ఏంటి. మోదీ ఎందుకు అక్కడే ధ్యానం చేస్తున్నాంటే దేశ వ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో వెలసిన శక్తిపీఠం కూడా ఒకటి. భ్రమరాంబ దేవి చత్రపతి శివాజీకి యుద్ధం చేసేందుకు ఖడ్గం ఇచ్చారని.. ఆ ఖడ్గంతోనే దిగ్విజయంగా రాజ్యాలపై విజయం సాధించారని, ఆ స్ఫూర్తి భావితరాలకు అందేలా శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వెలిసిందని చెప్తున్నారు.