Pawan Kalyan: తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదు.. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదుః పవన్

|

Oct 02, 2021 | 3:27 PM

ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే.. తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు.

Pawan Kalyan: తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదు..  రాష్ట్ర రాజకీయాలు  రెండిళ్ల మధ్య జరిగితే  కుదరదుః పవన్
Pawan Kalyan 2
Follow us on

Pawan Kalyan: ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే.. తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన తలపెట్టిన శ్రమదానం’ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుంచి మొదలుకుని.. బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం’ అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు.. అభిమానులు, కార్యకర్తలు ఏ మాత్రం తగ్గకుండా భారీగానే సభకు తరలివచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

ప్రశ్నించే వాడంటే అధికార పక్షానికి భయం పట్టుకుందన్న పవన్.. అందుకే నేనంటే వైసీపీ భయమన్నారు. ప్రశ్నించాలంటూ మొదట్నుంచీ నేను ప్రజలను మొత్తుకునేది అందుకేనన్నారు పవన్ కల్యాణ్. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేనాని. తనకు అన్నం పెట్టిన ప్రజల రుణం తీర్చుకోవడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానన్నారు. ప్రజల కోసమే నేను తిట్టు తింటున్నా. నా కోసమైతే ఎప్పుడో వాళ్ల తోలు తీసేవాడినన్నారు పవన్ కల్యాణ్. ఇక, తిడితే ఊరుకునేది లేదన్న జనసేనాని.. ఆడైనా మగయినా సరే తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదన్న పవన్.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే రోడ్లు లేవు, జీతాలు పెన్షన్లు రావని ఎద్దేవ చేశారు. బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే వాడిని కాదు, గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదని సూచించారు. నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని హితవు పలికారు. దుష్టపాలన అంతం కావాలంటే ప్రతి ఒక్కరూ ఏకం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా పనులు జరగడం లేదని పవన్ ఆరోపించారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత. నేను సీఎం కావాలని మనసులో కోరుకోండి. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. త్వరలోనే అధికారంలోకి వస్తామని వెల్లడించారు. పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికి పవన్ కళ్యాణ్.. రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదని జనసేనాని చెప్పుకొచ్చారు. వైసీపీ అల్లరి, రౌడీ మూకలను ఎదుర్కోవడం టీడీపీ వల్ల కావడం లేదన్నారు జనసేనాని. తెలుగుదేశం సత్తా సరిపోకపోవడం వల్లే జనసేన రోడ్లపైకి వచ్చిందన్నారు.

Read Also….  Huzurabad By Election: ఆ తేదీల్లో నాపై దాడికి కుట్ర… ఎన్నికల ప్రచారంలో ఈటల సంచలన కామెంట్స్..