Pawan Kalyan: ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నారు.. అది ఎవరి తరం కాదు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్

|

Sep 04, 2022 | 6:52 AM

వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. తమను చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణలకు...

Pawan Kalyan: ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నారు.. అది ఎవరి తరం కాదు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్
Pawan Kalyan
Follow us on

వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. తమను చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన జెండా ఆవిష్కరణలకు అడ్డుపడుతున్న తీరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారన్న పవన్ కల్యాణ్.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డెక్కుతానని వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నేత పోతిన మహేశ్ (Potina Mahesh) ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసిన ఘటనలో దోషులపై కేసులు పెట్టకుండా తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము ఏ పని చేసినా పోలీసులు అడ్డు తగులుతున్నారని, ఈ పరిణామాలు చూస్తుంటే భయపడుతున్నట్లే అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

జనసేన పార్టీ నేతలు చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా. జనసేన ఉనికిని తీసేయాలనుకుంటున్నారు. అది ఎవరి తరం కాదు. ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. ఇంత జరుగుతున్నా శాంతి భద్రతలకు ఇబ్బంది కలగుతుందని రోడ్డు మీదరు రాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

– పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇవి కూడా చదవండి

కాగా.. విజయవాడ వన్ టౌన్ జెండా చెట్టు సెంటర్ లోని జనసేన దిమ్మెని కొందరు వ్యక్తులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జనసేన నేతలను పంపించేశారు. పార్టీ నేత పోతిన మహేశ్ ను ప్రశ్నించారు. అనంతరం ఆయనను వన్ టౌన్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..