Andhra Pradesh: తల్లిదండ్రుల ట్విస్ట్.. ఖననం చేసిన మృతదేహం వెలికి తీత.. అసలేం జరిగిందంటే..!

|

Aug 04, 2022 | 4:04 PM

Andhra Pradesh: ఖననం చేసిన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు అధికారులు. అనంతరం రీపోస్టుమార్టం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలం వెలువోలులో చోటు చేసుకుంది.

Andhra Pradesh: తల్లిదండ్రుల ట్విస్ట్.. ఖననం చేసిన మృతదేహం వెలికి తీత.. అసలేం జరిగిందంటే..!
Bengemen
Follow us on

Andhra Pradesh: ఖననం చేసిన వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు అధికారులు. అనంతరం రీపోస్టుమార్టం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలం వెలువోలులో చోటు చేసుకుంది. ఇంతకీ ఖననం చేసిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు ఎందుకు తీయాల్సి వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వెలువోలు గ్రామానికి చెందిన కల్లేపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు కల్లేపల్లి బెంజిమెన్ (20) గత నెల 27వ తేదీన మోపిదేవి మండలం పరిధిలోని కాసానగరం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. బెంజిమెన్ ను విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 29వ తేదీ ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని అదే రోజు కుటుంబ సభ్యులు ఖననం చేశారు. అయితే, ఖననం తరువాత కుటుంబ సభ్యులకు మృతిపై అనుమానం రావడంతో మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మోపిదేవి ఎస్ఐ జనార్ధన్ వెలువోలు చేరుకుని చల్లపల్లి తాసిల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో ఖననం చేసిన మృతదేహాన్ని మళ్లీ వెలికి తీశారు. అనంతరం అధికారుల సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతుందని మోపిదేవి ఎస్‌ఐ జనార్ధన్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..