Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్రకు గ్రీన్ సిగ్నల్.. బోటు సర్వీసులు ఎప్పటినుంచంటే..?

|

Oct 28, 2021 | 8:15 AM

Papikondalu Boat Services: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండలు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది. కచ్చులూరు బోటు

Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్రకు గ్రీన్ సిగ్నల్.. బోటు సర్వీసులు ఎప్పటినుంచంటే..?
Papikondalu
Follow us on

Papikondalu Boat Services: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండలు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలంటూ మంత్రి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నదిలో 28 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడే బోట్లను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అయితే.. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్‌ ధరను రూ.1,250 గా నిర్ణయించినట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతేడాది గోదావరి నదిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు.

Also Read:

Fuel Price Today: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?

Chandrababu Naidu: రేపటి నుంచి రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

YSRCP: బద్నాం చేయడమే పని.. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య అదే.. విమర్శలు గుప్పించిన సజ్జల