ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్​ చైర్మన్​గా పునూరు గౌతమ్​రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

|

Jan 12, 2021 | 8:08 PM

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్  పూనూరు గౌతమ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్​ చైర్మన్​గా పునూరు గౌతమ్​రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్  పూనూరు గౌతమ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీకి ఆదేశాలు అందాయి.

విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు అధిష్టానం టికెట్ కేటాయించలేదు. కాగా గతంలో వంగవీటి రాధాపై గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాదు. ఆ సమయంలో పార్టీ అతనికి షోకాజ్ నోటీసు సైతం జారీ చేసింది. ఆపైన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు గౌతమ్ రెడ్డి.

Also Read:

ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు

Bowenpally Kidnap Case: కిడ్నాప్ కేసులో మరో సంచలన ట్విస్ట్.. జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు

Viral News: ఎంత క్రియేటివిటీ..ఎంత క్రియేటివిటీ.. ఖాకీలే కంగుతిన్నారు.. ఎలుక కన్నాల మాటున