AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: సంక్రాంతి పండుగ హడావుడిలో ఓవర్ టేక్.. మూడు లారీలు, ఒక బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

Road Accident: సంక్రాంతి పండక్కి సొంతింటి వెళ్లాలని తొందర ఒకరికి.. పట్నం నుండి పల్లె కు చేరి పండుగ చేసుకుందాం అనే తొందర మరొకరిది..

Road Accident: సంక్రాంతి పండుగ హడావుడిలో ఓవర్ టేక్.. మూడు లారీలు, ఒక బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2021 | 8:42 PM

Share

Road Accident: సంక్రాంతి పండక్కి సొంతింటి వెళ్లాలని తొందర ఒకరికి.. పట్నం నుండి పల్లె కు చేరి పండుగ చేసుకుందాం అనే తొందర మరొకరిది.. వెరసి కాస్త ఏమరపాటుతో ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు తమ తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. గ్రామాల్లో సంక్రాంతిని జరుపుకోవాలని ఉత్సాహంతో వాహనాల్లో దూసుకెళ్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ స్థాయిలో వాహనాలు క్యూ కట్టాయి. ఓవర్ టేక్‌లతో వాహనాలు రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. చిన్న వాహనాలు పోటీ పడుతుంటే.. పెద్ద వాహనదారులు తామేం తక్కువ అన్నట్లుగా దూసుకుపోతున్నారు.

ఇలా వాహనదారుల పరస్పర ఓవర్ టేక్‌లతో హైదరాబాద్-విజయవాడ రహదారి భయానకంగా మారింది. ఈ క్రమంలోనే జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాన్ని మరొకటి ఓవర్ టేక్ చేయబోయి మూడు లారీలు, ఓ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, రోడ్డు ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణకాల సంతోషం కోసం జీవితాలను కోల్పోవద్దని హితవుచెబుతున్నారు.

Also read:

ఆ ఫలకం ఇంట్లో ఉంటే ధనవంతులవుతారట.. గ్యాంగ్ గారడీ.. పోలీసులు అదుపులో కిలాడీలు

Suicide Attempt: రెండేళ్లుగా కాపురానికి రాకుండా తల్లిగారింట్లోనే భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త..