Rains: పొంగి పొర్లుతోన్న వెదురుగెడ్డ వాగు.. తూర్పు – విశాఖ జిల్లా సరిహద్దుల్లో రాకపోకలు బంద్

|

Oct 10, 2021 | 8:41 PM

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నయి. భారీ వర్షాల కారణంగా సరిహద్దులలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి

Rains: పొంగి పొర్లుతోన్న వెదురుగెడ్డ వాగు..  తూర్పు - విశాఖ జిల్లా సరిహద్దుల్లో రాకపోకలు బంద్
Vsp Rains
Follow us on

TRaffic Closed: విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నయి. భారీ వర్షాల కారణంగా సరిహద్దులలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. నర్సీపట్నం నుండి తుని వెళ్లేరహదారిలో రెండు జిల్లాల సరిహద్దు లోని వెదురుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ గెడ్డ రహదారిపై నుండి ప్రవహిస్తోంది. దీన్ని ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రెండు వైపుల నుండి వెళ్లే వాహనదారులు రోడ్డుపై నుండి వెళ్లేందుకు భయపడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో రెండువైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుండి తుని వెళ్లే ప్రధాన రహదారి కావడంతో దీనిపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గెడ్డ ఉద్ధృతి తగ్గాక వాహనాలను పంపేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Punjab CM’s son’s Marriage: లీడర్ల కళ్లు తెరిపించేలా పంజాబ్‌ సీఎం కుమారుడి వివాహం. చాలా సింపుల్‌గా, ఆర్భాటం లేకుండా వేడుక