Balineni Srinivasa Reddy: మా పార్టీ నేతలే నా పై కుట్ర చేస్తున్నారు.. మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..

|

Jun 27, 2022 | 7:46 PM

దీని వెనుక టీడీ జనార్ధన్‌ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా..

Balineni Srinivasa Reddy: మా పార్టీ నేతలే నా పై కుట్ర చేస్తున్నారు.. మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Balineni Srinivasa Reddy
Follow us on

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు… తన స్వంత పార్టీకి చెందిన నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.   త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తానని, అవసరమైనే సియంకు ఫిర్యాదు చేస్తానన్నారు… ఇటీవల తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని TDP నేతలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి కొంతమంది YCP నేతలు సహకరిస్తున్నారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రలో స్వంత పార్టీ నేతలు కూడా ఉన్నారని తెలుసుకుని సిగ్గుపడుతున్నానన్నారు. గతంలో చెన్నైలో 5 కోట్లు పట్టుబడినా.. ఇటీవల జనసేన మహిళా నేతకు ఫోన్ వచ్చినా , అల్లూరులో కవిత అనే మహిళ కుటుంబ కలహాలను వాడుకుని తనపై బురద చల్లినా , దీని వెనుక టిడిపి నేతలు దామచర్ల జనార్దన్, మంత్రి శ్రీను ఉన్నారన్నారని ఆరోపించారు.

జనసేన మహిళా నేత విషయంలో పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారని.. ఆయనపై గౌరవంతో స్పందించామన్నారు. ఇదే విషయంపై తాను పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నానని.. మీ మహిళా నేత విషయంలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టగలరా అని  పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. మీ విచారణలో తన తప్పు ఉందని తేలితే తన పదవికి, పార్టీకి రాజీనా చేస్తానన్నారు.

పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న గౌరవంతోనే ప్రశ్నిస్తున్నానన్నారు… అలాగే రెండు రోజుల క్రితం చెన్నైలో ఒంగోలుకు చెందిన వారి రెండు కోట్లు పట్టుబడినా అది తనకే ఆపాదిస్తూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పై జరుగుతున్న కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని… కాల్ డేటా తెప్పించుకొని విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు.

ఏపీ వార్తల కోసం