Munna Gang Case: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో 12 మందికి ఉరి శిక్ష

Munna Gang Case: హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మున్నాతో..

Munna Gang Case: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో 12 మందికి ఉరి శిక్ష
Allahabad High Court

Updated on: May 24, 2021 | 3:04 PM

Munna Gang Case: హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల కిందట హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను మున్నా గ్యాంగ్‌ హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు లారీ డ్రైవర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి  న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఇవీ కూడా చదవండి:

Coronavirus: కుక్కలు మనిషి చెమట వాసనను ద్వారా కరోనాను గుర్తిస్తాయి: తాజా పరిశోధనలో లండన్‌ శాస్త్రవేత్తలు

America: అమెరికాలో అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Loading...
Unable to load recommendations.
Follow Us