Jagananna Suraksha
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ పథకం ప్రారంభించిన తొలి రోజే పెన్షన్ల కోసం కష్టాలు పడుతున్న పలువురు అధికారులకు విన్నవించేందుకు క్యూ కట్టారు. ఈ క్రమంలో.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మణూరులో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ ఎదురుగానే పెన్షన్ కోసం సబ్ కలెక్టర్ కాళ్లు పట్టుకున్నాడు ఓ బాధితుడు. ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉందని పెన్షన్ రాదని అధికారులు చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఓ వృద్ధుడు. ఓటర్ కార్డులో పుట్టిన తేదీకీ… ఆధార్ కార్డులోని డేట్‌కు తేడా ఉందని కారణంతో పెన్షన్ ఇవ్వడంలేదని సబ్ కలెక్టర్‌కు చెప్పి కంటతడి పెట్టాడు. పుట్టిన తేదీ సరి చేసుకొని వస్తే పెన్షన్ ఇస్తామంటూ అధికారులు.. రోజూ.. కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోయాడు బాధితుడు. దాంతో.. షాకైన సబ్ కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..