Odisha Train Accident: విజయవాడ రైల్వేస్టేషన్‌ చేరుకున్న స్పెషల్ ట్రైన్.. బాధితులకు ప్రజాప్రతినిధుల పరామర్శ..

|

Jun 04, 2023 | 5:42 AM

ఒడిషా రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏపీ ప్రయాణికులను స్పెషల్ ట్రైన్‌లో విజయవాడకు చేర్చారు అధికారలు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపించారు. మరి కొంత మంది ఆచూకీ కోసం సెర్చ్‌ చేస్తున్నారు. అయితే జరిగిన ఘటనను తలుచుకుంటూ ప్రయాణికులు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు.

Odisha Train Accident: విజయవాడ రైల్వేస్టేషన్‌ చేరుకున్న స్పెషల్ ట్రైన్.. బాధితులకు ప్రజాప్రతినిధుల పరామర్శ..
Vijayawada Train
Follow us on

ఒడిషా రైలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఏపీ ప్రయాణికులను స్పెషల్ ట్రైన్‌లో విజయవాడకు చేర్చారు అధికారలు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపించారు. మరి కొంత మంది ఆచూకీ కోసం సెర్చ్‌ చేస్తున్నారు. అయితే జరిగిన ఘటనను తలుచుకుంటూ ప్రయాణికులు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు.

ఒడిషా రైలు ప్రమాద స్థలం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒడిషా నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు రాత్రి విజయవాడ చేరుకుంది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఈ రైలులో వచ్చారు. స్పెషల్ ట్రైన్‌లో 9 మంది ప్రయాణికులు విజయవాడ చేరుకున్నారు. వచ్చిన వారిని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు స్వాగతం పలికారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు.

ప్రమాదం నుంచి బయటపడి ఇక్కడికి చేరుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు బాధిత ప్రయాణికులు చెప్పారు. ప్రమాదం దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడ ప్రాంతానికి చెందిన ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఒడిషా రైలు ప్రమాదంపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళంలో నూ హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎవరైనా ఉంటే.. వారి బంధువులు స్థానిక రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ నంబర్లుకు సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..