Tirumala Laddu: ‘ఎవరైనా తిని చనిపోయారా.? లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయ్యొద్దు’

|

Sep 21, 2024 | 1:40 PM

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తిరుమల లడ్డూ వ్యవహారం అటు దేశ రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు దేశ, రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

Tirumala Laddu: ఎవరైనా తిని చనిపోయారా.? లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయ్యొద్దు
Tirumala Laddu
Follow us on

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తిరుమల లడ్డూ వ్యవహారం అటు దేశ రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు దేశ, రాష్ట్ర మంత్రులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా.? అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా.? అని మండిపడ్డారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దని విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారని.. ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండని ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అటు తిరుమల లడ్డూ వివాదంపై సీమాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీమాన్ మానసిక పరిస్థితి బాగోలేదని ధ్వజమెత్తారు. శ్రీవారి భక్తుల మనోభావాలను సీమాన్ దెబ్బతీశారన్నారు. టీటీడీకి, శ్రీవారి భక్తులకు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..