AP News: ఇకపై 20 నిమిషాల్లోనే ఈసీ.. మీ చేతిలోనే ‘మీ సేవ’

| Edited By: Velpula Bharath Rao

Nov 19, 2024 | 7:33 AM

గతంలో ఈ సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ మీసేవా కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. కొత్త ప్రభుత్వం ఆ శ్రమను సైతం తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ విధానం సత్ఫలితాలను ఇస్తుంది.

AP News: ఇకపై 20 నిమిషాల్లోనే ఈసీ.. మీ చేతిలోనే మీ సేవ
Now Easy Ec Within 20 Minut
Follow us on

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభతరం అయ్యాయి. అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కానీ, ఇటు మీ సేవా కేంద్రానికి గానీ నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండానే ఈసీ, సీసీ వంటి సేవలు అందుకునే అవకాశం లభించింది. సగటు పౌరుడు సైతం తనకు అందుబాటులో ఉన్న ప్రాంతం నుండి ఆన్‌లైన్ విధానంలో అవసరమైన రుసుమును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించటం ద్వారా ఈసీ, సీసీలను క్షణాల వ్యవధిలో పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపు గేట్ వే ను అభివృద్ది పరిచింది. ఇది మంచి పనితీరును ప్రదర్శిస్తూ ఉండటంతో ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలు ఆన్‌లైన్‌లో తక్షణమే పొందగలిగే వెసులుబాటు లభించింది. నిజానికి ఆన్ లైన్ సౌకర్యాన్ని అందిపుచ్చుకోలేని గ్రామీణ ప్రాంత వాసులు మీ సేవ ద్వారా కూడా ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలను అందుకోవచ్చు. దానికి ఎటువంటి పరిమితులు లేవు.

సబ్ రిజిస్ట్రార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..

గతంలో ఈ సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ మీసేవా కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. కొత్త ప్రభుత్వం ఆ శ్రమను సైతం తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ విధానం సత్ఫలితాలను ఇస్తుంది. నిర్ణీత దరఖాస్తును నింపి దానిని సబ్ రిజిస్ట్రార్ లేదా మీ సేవా కేంద్రానికి తీసుకువెళ్లవలసిన అవసరం లేకుండా పోయింది. గతంలో ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీ సేవల కోసం మీసేవలో దరఖాస్తు చేసిన తరువాత, అది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని, అక్కడ తగిన అనుమతులు పొందిన తదుపరి మీసేవలో జరిగే డౌన్ లోడ్ ప్రక్రియ ద్వారా మాత్రమే డాక్యుమెంట్ ను పొందగలిగే వారు. ఫలితంగా మితిమీరిన కాలయాపన జరిగేది. రెండు, మూడు రోజుల సమయం తీసుకునేది. సెలవు రోజులు వస్తే అది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండేది. దరఖాస్తుదారు కనీసం రెండు నుండి మూడు సార్లు మీసేవ కార్యాలయానికి తిరిగవలసి వచ్చేంది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండానే అతి తక్కువ వ్యవధిలో అవసరమైన డాక్యుమెంట్ ప్రజలకు చేరుతోంది.

మధ్యవర్తుల ప్రమేయానికి చెక్

గతంలో దరఖాస్తుదారుడు చెల్లించిన ఫీజులు మీ సేవా విభాగానికి జమ అయ్యేవి. ఇప్పుడు నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు జమపడుతున్నాయి. ప్రస్తుత ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈసీ, సీసీలు పొందగలుగుతున్నారని రెవెన్యూ (భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, విపత్తుల నిర్వహణ, స్లాంపులు, రిజిస్టేషన్లు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తెలిపారు. మీ సేవా కేంద్రాలలో ఈ తరహా సేవలు అందుబాటులో లేవన్నది నిజం కాదన్నారు. పౌరులకు మెరుగైన సేవలు అందుతున్నాయని, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం సరికాదని సిసోడియా స్పష్టం చేసారు. కేవలం మీ సేవ ద్వారా మాత్రమే కాకుండా ఆన్ లైన్ సేవల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభం అయ్యాయి. అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కాని, ఇటు మీ సేవా కేంద్రానికి కాని నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇషి, సిసి వంటి సేవలు అందుకునే అవకాశం లభించింది. సగటు పౌరుడు సైతం తనకు అందుబాటులో ఉన్న ప్రాంతం నుండి ఆన్ లైన్ విధానంలో అవసరమైన రుసుమును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లించటం ద్వారా ఈసీ, సీసీలను క్షణాల వ్యవధిలో పొందగలుగుతున్నాడు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపు గేట్ వే ను అభివృద్ది పరిచింది. ఇది మంచి పనితీరును ప్రదర్శిస్తూ ఉండటంతో ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలు ఆన్‌లైన్‌లో తక్షణమే పొందగలిగే వెసులుబాటు లభించింది. నిజానికి ఆన్ లైన్ సౌకర్యాన్ని అందిపుచ్చుకోలేని గ్రామీణ ప్రాంత వాసులు మీ సేవ ద్వారా కూడా ఎన్‌కంబరెన్స్, సర్టిఫైడ్ కాపీలను అందుకోవచ్చు. దానికి ఎటువంటి పరిమితులు లేవని రెవెన్యూ కార్యదర్శి అర్ పీ సిసోడియా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి