Atmakur By-election: తొలి నామినేషన్‌ దాఖలు.. ఆత్మకూరు ఉప ఎన్నికకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ..

|

May 30, 2022 | 12:36 PM

లి నామినేషన్‌ దాఖలైంది. ఆ పార్టీ అభ్యర్థి గోదా రమేష్‌ నామినేషన్‌ వేశారు. ఆత్మకూరులో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. టీడీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వైసీపీ నుంచి మేకపాటి ..

Atmakur By-election: తొలి నామినేషన్‌ దాఖలు.. ఆత్మకూరు ఉప ఎన్నికకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ..
Atmakuru
Follow us on

మంత్రి గౌతమ్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు(Atmakur By Election) నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జూన్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జూన్ 23న పోలింగ్ జరుగుతుంది. 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి తొలి నామినేషన్‌ దాఖలైంది. ఆ పార్టీ అభ్యర్థి గోదా రమేష్‌ నామినేషన్‌ వేశారు. ఆత్మకూరులో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. టీడీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వైసీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి రెండో కొడుకు విక్రమ్‌ పోటీ చేయబోతున్నారు. బీజేపీ బరిలో ఉంటే ఇక్కడ కచ్చితంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. జూన్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైసీపీ తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ నెల 25న షెడ్యూల్‌ విడుదల చేసింది.