Andhra Pradesh: ‘వైద్య విద్యార్ధులకు డ్రెస్‌కోడ్ పెట్టలేదు’.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..

మెడిసిన్ విద్యార్ధినులతో పాటు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Andhra Pradesh: 'వైద్య విద్యార్ధులకు డ్రెస్‌కోడ్ పెట్టలేదు'.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..
Ap Medical Students
Follow us

|

Updated on: Dec 02, 2022 | 8:11 PM

ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య విద్యార్ధులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని.. మెడిసిన్ విద్యార్ధినులతో పాటు అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే, తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం(డీఎంఈ) ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు మీడియా వర్గాల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా విద్యార్ధుల్లో గందరగోళం ఏర్పడింది.

ఇక తాజాగా దీనిపై వైద్య విద్య కమిషనర్ ఆఫీస్ వివరణ ఇచ్చింది.సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య విద్యార్ధులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదంటూ ఇంటర్నెట్, మీడియా వర్గాల్లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ పూర్తి అవాస్తవం అని వైద్య విద్య కమిషనర్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. వైద్య విద్యార్ధులకు ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టలేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..