భూముల ధరల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులకు తీపికబురును అందిస్తూ ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రతీ ఏటా ఆగష్టు 1వ తేదీన భూముల ధరలను ప్రభుత్వం పెంచుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏడాది వివిధ వర్గాల వారి నుంచి, సాధారణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని జగన్ సర్కార్ తెలిపింది. కాగా, ఈ తరుణంలో భూములపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి ఇది శుభవార్త అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
కాగా, గతేడాది ఆగష్టులో ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలను 10 నుంచి 30 శాతం వరకు పెంచిన విషయం విదితమే. విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 శాతం, విశాఖపట్నంలో 25 శాతం, అనంతపురంలో 30 శాతం మేరకు భూముల ధరలను పెంచింది. పెంచిన భూముల ధరలతో సుమారు రూ. 800 కోట్ల మేరకు ఆదాయం వచ్చినట్లు అంచనా.
Also Read:
లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!
పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!