Andhrapradesh: రథాలకు నూతన హంగులు.. ఊరేగింపులో ప్రత్యేక సొగసులు

| Edited By: Surya Kala

Oct 05, 2024 | 6:24 PM

రధం లాగటానికి కట్టిన ఐదు గుర్రాలు ఐదు ఇంద్రియాలు. ఇవి రుచి, చూడటం, వినడం, వాసన చూడటం, స్పర్శను కలిగివుండటం అనే మానవ ఇద్రియ గుణాలకు ప్రతీకలుగా భావిస్తారు. రథ సారథి రధం ను ముందుకు నడపటానికి వినియోగించే పగ్గాలు మానవ మనస్సుకు ప్రతీక. నడిపే వ్యక్తి అంటే డ్రైవర్ మానవ మేధస్సును సూచిస్తే అందులో ప్రయాణీకుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మగా భావిస్తుంటారు.

Andhrapradesh: రథాలకు నూతన హంగులు.. ఊరేగింపులో ప్రత్యేక సొగసులు
New Types Of Chariots
Follow us on

రధాలకు హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొంత కాలం క్రితం విడుదలైన బాహుబలి సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో బల్లాలదేవుడిగా నటించిన రాణా నడిపే రధం ప్రత్యేకంగా ఉంటుంది. ముందు చక్రాలకు పదునైన ఫ్యాన్ లు అమర్చి ఉంటాయి. రధం కదులుతూ ఉంటే ఎడురుపడినవారిని ఆ పదునైన ఫ్యాన్ రెక్కలు ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటుంది. ఇంకా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస గ్రంధాలలో అన్నాతి రాజులు , చక్రవర్తుల ప్రయాణించిన రధాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ముక్యంగా “కపి ధ్వజ”- ఇది అర్జునిడి రథం. ఇక్కడ రథం మానవ శరీరాన్ని సూచిక గా భావిస్తారు. రధం లాగటానికి కట్టిన ఐదు గుర్రాలు ఐదు ఇంద్రియాలు. ఇవి రుచి, చూడటం, వినడం, వాసన చూడటం, స్పర్శను కలిగివుండటం అనే మానవ ఇద్రియ గుణాలకు ప్రతీకలుగా భావిస్తారు. రథ సారథి రధం ను ముందుకు నడపటానికి వినియోగించే పగ్గాలు మానవ మనస్సుకు ప్రతీక. నడిపే వ్యక్తి అంటే డ్రైవర్ మానవ మేధస్సును సూచిస్తే అందులో ప్రయాణీకుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మగా భావిస్తుంటారు.

కురుక్షేత్రం యుద్ధం సమయంలో హనుమంతుడు అర్జునుని రథ జెండాపై యుద్ధ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. అందుకే ఇప్పటికి విజయానికి గుర్తుగా చాలామంది తమ ఇల్లు , భవంతులపై హనుమంతుడి జెండాను ఎగుర వేస్తారు. మహాభారత యుదంలో కర్ణుడు రధం భూమిలోకి కూరుకు పోతుంటే దాన్ని బయటకు తీసేందుకు కర్ణుడు విశ్వప్రయత్నం చేసాడు. అది బయటకు రాకపోవటానికి భూదేవి శాపంగా చెబుతుంటారు. ఇక పూరిలో జరిగే జగన్నాదుడి రధయాత్ర చాలా విశేషంగా చెప్పుకోదగినిది.

ఇలా పౌరాణికాలు, ఇతిహాసాల్లో పేర్కున్న చాలా పాత్రల్లో వారు వదిన ఆయుధాలకు , ప్రయాణించిన వాహనాలు అంటే రధాలకు చాలా పేర్లు ఉన్నాయి. వాటికీ ఆయా పాత్రను బట్టి , రధానికి ఉన్న లక్షణాలను బట్టి విశిష్టతలను కూడా చెప్పారు. పూర్వం ఎక్కువగా రధాలను అశ్వాలు లాగేవి. తరువాత ఉత్సవాల సమయంలో దేవుడు ఊరేగే సమయంలో ఆయన రధాలను ఏనుగులతో లాగిస్తారు . ఇక భగవంతుడి సేవలో భాగంగా భక్తులు సైతం రధాలు లాగటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాము.

ఇవి కూడా చదవండి

అయితే ఇపుడు ఆధునిక కాలం పూర్వం లా ఎంత ధనికులైనా రధాలపై వెళ్ళటం సాద్యం కాదు ఎందుకంటే సమయం వృధా. ఇపుడంతా కార్లు , విమానాలలో ప్రయాణించే రోజులు. ఇక దేవుళ్ళ విగ్రహాలను కొన్ని చోట్ల ట్రాక్టర్స్ పై ఉంచి లేదా ఇతర వాహనాల్లో ఊరేగించటం కూడా తరుచుగానే చూస్తున్నాము. ఇంతటి ప్రాధాన్యత ఉండటంతో ఇపుడు రకరకాల రధాలు పండుగలు, వేడుకలు సమయంలో జరిగే ఊరేగింపుల్లో తమ ఉనికిని ఇంకా చాటుకుంటున్నాయి. ఇవి కృతిమమంగా, యంత్రాలతో ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇనుము, ఫైబెర్ తో తయారు చేయబడుతున్నాయి.

వీటిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో తయారు చేస్తున్నారు. వీటిని పండుగల సమయంలో దేవుళ్ళ ఊరేగింపులు , వేడుకల సమయంలో ప్రత్యెక ఆకర్షణ కోసం చాలా మంది అద్దెకు తీసుకు వెళ్లి ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..