Andhra Pradesh: టీడీపీని టెన్షన్ పెడుతున్న సీఐడీ చీఫ్ కామెంట్స్.. నెక్ట్స్ జరుగబోయేది అదేనా?

|

Sep 15, 2023 | 7:11 AM

ఏపీలో స్కిల్ స్కాం కేసు హీటెక్కిస్తుంది. తాజాగా సీఐడీ చీఫ్ చూపించిన సంతకాలు, చెబుతున్న రహస్యాలు.. టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయి. లోకేష్‌ పాత్రపై విచారణ చేస్తామడంపై ఆపార్టీలో అలజడి నెలకొంది. బెయిల్‌ కోసం ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. వాటికి కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయనుంది సీఐడీ. విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Andhra Pradesh: టీడీపీని టెన్షన్ పెడుతున్న సీఐడీ చీఫ్ కామెంట్స్.. నెక్ట్స్ జరుగబోయేది అదేనా?
Nara Lokesh And Balakrishna
Follow us on

Andhra Pradesh: ఏపీలో స్కిల్ స్కాం కేసు హీటెక్కిస్తుంది. తాజాగా సీఐడీ చీఫ్ చూపించిన సంతకాలు, చెబుతున్న రహస్యాలు.. టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయి. లోకేష్‌ పాత్రపై విచారణ చేస్తామడంపై ఆపార్టీలో అలజడి నెలకొంది. బెయిల్‌ కోసం ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. వాటికి కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయనుంది సీఐడీ. విచారణపై ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తుంది. నిందితునిగా మాజీ సీఎం చంద్రబాబు పేరును చేర్చారు. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేశ్ పేరును ప్రస్తావించారు. రిపోర్ట్ లో లోకేశ్ పేరు చేర్చుతూ.. స్కాంలో ఆయన పాత్రపై విచారణ చేస్తామని చెప్పారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. స్కిల్ కేసులో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని, అందులో ప్రమేయం ఉన్న వాళ్లందరికీ శిక్ష పడుతుందన్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో లోకేశ్ పేరు ఉండగా.. తాజా లోకేశ్ ను విచారణకు పిలుస్తామని.. లోకేష్ పాత్రపై దర్యాప్తు చేస్తామని జరుపుతామన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన పవన్‌ కల్యాణ్.. ఎక్కడైనా బాబు సంతకాలు ఉన్నాయా? ప్రూఫ్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలకు సైతం సీఐడీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు చేశారు, ఎప్పుడు పెట్టారన్న విషయాలను మీడియాకు వెల్లడించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సీఐడీకి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఐడీ ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశముంది.

ఇక ఏసీబీ రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరువైపులా వాదనలు వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సీఐడీని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి.. ఈ నెల 19కి విచారణను వాయిదా వేశారు. అలాగే చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విషయంలోనూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 18 వరకు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..