AP News: ఏపీ మందుబాబులకు ఇక పండగే.. రూ. 99కే లిక్కర్, కొత్త లిక్కర్ పాలసీ వివరాలివిగో

|

Oct 01, 2024 | 1:15 PM

ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు చేయనుండగా..

AP News: ఏపీ మందుబాబులకు ఇక పండగే.. రూ. 99కే లిక్కర్, కొత్త లిక్కర్ పాలసీ వివరాలివిగో
Liquor Shop
Follow us on

ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు చేయనుండగా.. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల్లో 12 ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజు వసూలు చేయనున్నారు. తొలి ఏడాది, పది వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. 5లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో ఒక్కో మద్యం షాపుకు రూ.85లక్షలు వసూలు చేస్తారు.

ఇక ప్రీమియం స్టోర్లకు కోటి రూపాయలు వసూలు చేస్తారు. ప్రీమియం స్టోర్లకు మినహా.. మిగిలిన మద్యం షాపులకు ఏడాదికి 10శాతం చొప్పున లైసెన్సు ఫీజు పెంచుకుంటూ వెళతారు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. అయితే రూ.2లక్షల చొప్పున నాన్‌ రీఫండబుల్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 9వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ లైసెన్స్‌లు పని చేయనున్నాయి.

అటు టెంపుల్‌ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులను కేటాయించలేదు ప్రభుత్వం. మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచేందుకే ఈ నూతన మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా ఇంతకాలం అధిక ధరలతో బెంబేలెత్తిపోయి జేబులు ఖాళీ చేసుకున్న మందుబాబులకు ఇకపై ఊరట లభించనుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలో కూడా తక్కువ ధరకే మద్యం లభించనుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..