మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ సర్కార్.. కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల

మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నూతన ఎక్సైజ్ పాలసీని శుక్రవారం విడుదల చేసింది. ఇకపై ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈఏడాది 3,500 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రతి షాపుకు తెలుగు, ఇంగ్లీష్‌లో నెంబర్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో షాప్‌ల ఎంపికకు ఆరుగురితో కమిటీ ఏర్పాటు కానుంది. ఒక్కో షాపుకు […]

మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ సర్కార్.. కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల

Edited By:

Updated on: Aug 17, 2019 | 1:55 AM

మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నూతన ఎక్సైజ్ పాలసీని శుక్రవారం విడుదల చేసింది. ఇకపై ఏపీ బేవరేజస్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈఏడాది 3,500 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రతి షాపుకు తెలుగు, ఇంగ్లీష్‌లో నెంబర్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో షాప్‌ల ఎంపికకు ఆరుగురితో కమిటీ ఏర్పాటు కానుంది.

ఒక్కో షాపుకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమించనుంది ప్రభుత్వం. డిగ్రీ అర్హతతో సూపర్‌వైజర్‌లను నియమించనుంది. వీరికి రూ. 17,500 జీతం ఇవ్వనుంది. పూర్తిగా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ షాపుల నిర్వహణ ఉంటుంది.