New Chief Justices To Telugu States: దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం తీర్మానం చేసింది. అందులో కొంతమందికి పదోన్నతులు లభించగా.. మరికొందరు బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు నియమితులయ్యారు.
ప్రస్తుతం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న మహేశ్వరి సిక్కం హైకోర్టుకు బదిలీ కాగా.. ఆమె స్థానంలో ఇప్పటిదాకా సిక్కం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన అరూప్ గోస్వామి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జోయ్ మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
అటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియామకం కాగా.. గతంలో ఈమె ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. తాజాగా హిమా కోహ్లీకి తెలంగాణ సీజేగా పదోన్నతి లభించింది. ఇక ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవరించిన ఆర్.ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు.
మరోవైపు ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ మహమ్మద్ రఫిక్ మధ్యప్రదేశ్‌కు బదిలీ కాగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక ఎంపీ హైకోర్టు న్యాయమూర్తి సతీష్ చంద్రను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి రాజేష్ బిందాల్ కోల్‌కతాకు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి వినీత్ కొఠారి గుజరాత్‌కు బదిలీ అయ్యారు.
Also Read:
బిగ్ బాస్ 4: టైటిల్ రేసులో టాప్‌కు ఎగబాకుతున్న అరియానా.! ఈసారి తెలుగమ్మాయి ట్రోఫీ కొట్టగలదా.?
కెప్టెన్‌గా స్మిత్‌కు ఇంకో ఛాన్స్ ఎండుకివ్వకూడదు.? సెలెక్టర్లపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఫైర్.!
తొలి టెస్టు మ్యాచ్‌కు బరిలోకి దిగనున్న నటరాజన్.. ప్రత్యర్ధులకు ఇక చుక్కలు ఖాయం..
బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..
తమిళ రాజకీయాల్లో సంచలనం.. తలైవా రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖరారు..! వివరాలివే..