
అతను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.. జైలుకి వెళ్లి పరామర్శించి వస్తూ అతన్ని ప్రేమించింది ఓ మహిళ.. ఇక అంతే అప్పటి నుంచి జైలులో అతను.. జైలు బయట ఆమె వరుసగా సెటిల్‌మెంట్లు చేస్తూఉన్నారు. ఇంతకీ ఎవరిగురించి ఈ స్టోరీ అర్ధమైంది కదూ.. నిడిగుంట అరుణ ఈ పేరు తెలియని వాళ్ళు కొంత మంది ఉంటారేమో కానీ లేడీ డాన్ అరుణ అంటే తెలియని వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉండక పోవచ్చు.. ఎందుకంటే రెండు నెలల క్రితం లేడి డాన్ అరుణ పేరు ఏపీ తెలంగాణలో మారుమోగింది.. అరుణ ప్రియుడు శ్రీకాంత్ బెయిల్ విషయంలో పోలీసులతో పాటు ఏపీలో అధికార ప్రతిపక్ష నేతలు తలలు పట్టుకునేలా చేసిన వ్యవహారం ఇప్పడు అప్పుడే మరిచిపోలేరు.. అయితే జీవిత ఖైదు అనుభవిస్తూ శ్రీకాంత్ జైల్లో ఉండగా పలు సెటిల్మెంట్ కేసులో అరుణ కూడా బెయిల్ రాక జైల్లోనే ఉంది. అయితే ఇద్దరు జైల్లో ఉండగా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అంటారా.. పేరుకు మాత్రమే వాళ్ళు జైల్లో ఉన్నా.. వాళ్ళ పనులు మాత్రం బయట జరిగిపోతాయని అంటున్నారు..
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అరుణ మాజీ భర్త భాగ్య రాజా తన పక్కన ఇంటి వాళ్ళ స్థలం కబ్జా చేసినట్టు బాధితులు గతంలో వెంకటగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాగ్యరాజ భార్య అరుణ కావడంతో న్యాయం చేసేందుకు వెనక్కి తగ్గారు.. అయితే ఇటీవల అరుణ వ్యవహారం బయటపడి ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉండడంతో ఇప్పటికే పలువురు బాధితులు పీఎస్ ల చుట్టు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా తన స్థలం కబ్జా చేసిన అరుణ భర్త భాగ్యరాజ వ్యవహారం పై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని అంటుంది భాదితురాలు సునీత.. అరుణకి ఆమె మొదటి భర్త భాగ్యరాజకు గ్యాప్ రావడంతో ఇద్దరు విడివిడిగా వుంటున్నారు. అయితే భార్య అరుణ డాన్ గా ఎదగడంతో ఆమెను అడ్డు పెట్టుకుని ఆమె భర్త భాగ్యరాజ ఇలాంటి చర్యలకు పాలడుతున్నరన్న ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..