Nellore Court Theft Case: నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయం కేసులో మంత్రి కాకాణికి క్లీన్‌చీట్..

|

Feb 04, 2024 | 1:53 PM

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. కోర్టు చోరీ కేసులో సీబీఐ 400 పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడాదిపాటు విచారణ జరిపిన సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించి.. ఈ కేసులో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Nellore Court Theft Case: నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయం కేసులో మంత్రి కాకాణికి క్లీన్‌చీట్..
Kakani Govardhan Reddy
Follow us on

నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. కోర్టు చోరీ కేసులో సీబీఐ 400 పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏడాదిపాటు విచారణ జరిపిన సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించి.. ఈ కేసులో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఛార్జ్‌ షీట్ దాఖలు చేసిన.. సీబీఐ ఈ కేసులో కాకాణి పాత్ర లేదంటూ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని తెలిపింది. అయితే, 2022 ఏప్రిల్ 13న నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్లు చోరీకి గురయ్యాయి. అయితే, మంత్రి కాకాణిపై మాజీమంత్రి సోమిరెడ్డి దాఖలు చేసిన నకిలీ డాక్యుమెంట్లు మాయం అయ్యాయని అభియోగం మోపగా.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదని సీబీఐ తేల్చింది. నేరానికి మంత్రి కాకాణికి సంబంధం లేదని చార్జ్ షీట్ లో పేర్కొంది. అంతేకాకుండా.. పోలీసుల విచారణలో ఎక్కడా పొరపాట్లు జరగలేదని స్పష్టంచేసింది. కోర్టులో చోరీచేయించి ఫైళ్లను మాయం చేయించారని ఆరోపించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చిన సీబీఐ.. ఆ ఆరోపణల్లో వాస్తవంలేదని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన సీబీఐ.. ఏపీ పోలీసుల విచారణను సమర్ధించింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలకు అలవాటుపడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజా.. కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని స్పష్టం చేసింది.

నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 2022 ఏప్రిల్ 13న అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లారు. అయితే, ఈ ఫైళ్ల మాయం కేసు హైకోర్టుకు చేరగా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీబీఐ.. కీలక సమాచారాలు సేకరించి ఛార్జ్ షిట్ దాఖలు చేసింది.

కాగా, మంత్రి కాకాణి సైతం సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో చెప్పారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ సైతం హైకోర్టుకి తెలపడంతో.. కోర్టు సీబీఐకి తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..