Free Ration: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో పరాకాష్టకు చేరుకుంది. రోజుకీ ఏకంగా 4 లక్షల కేసులతో విలయతాండవం చేస్తోంది. ఓవైపు కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితులు కూడా చిన్నాభిన్నమవుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు దీంతో పేదరికం పెరిగిపోతోంది.
ఈ క్రమంలోనే పేదలను ఆదుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మే, జూన్ నెలల్లో ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 5 కిలోల ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా అందిచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కొందరు రేషన్ డీలర్లు మాత్రం ఆహార ధాన్యాలను ఉచితంగా అందించకుండా అడ్డుకుంటున్నారు. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ దేశంలోని ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను కేటాయించింది. ఎవరైనా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడానికి నిరాకరిస్తే ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఇక టోల్ ఫ్రీ నెంబర్ల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్ వినియోగదారులు 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967 నెంబర్లకు, తెలంగాణకు చెందిన వినియోగదారులు 04023310462, 180042500333, 1967 నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు.
Also Read: అత్యవసర పరిస్థితుల్లో ఏ లోన్ తీసుకోవడం మంచిది… పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి
టైప్ 2 డయాబెటిస్ రోగులకు వేపనీరు దివ్యఔషధం..! పరగడుపున సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..