మహిళల కళకు గుర్తింపు..లేస్ అల్లికలకు జీఐ ట్యాగ్.. సర్టిఫికేట్ అందుకోనున్న కలెక్టర్..

| Edited By: Jyothi Gadda

Nov 25, 2024 | 5:30 PM

గతంలో ఇక్కడ నుంచి ఏటా రూ.250 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. చైనాలో యాంత్రీ కరణ అందుబాటులోకి రావడం, తక్కువ ధరలకు లేసు ఉత్పత్తులు లభించడంతో క్రమంగా ఇక్కడ మహిళలకు ఉపాధి దూరమైంది. తాజాగా దక్కిన గుర్తింపుతో ఇక్కడి ఉత్తత్తులకు మళ్ళీ పునర్వైభవం రానుందని లేస్ కుట్టు మహిళలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు.

మహిళల కళకు గుర్తింపు..లేస్ అల్లికలకు జీఐ ట్యాగ్.. సర్టిఫికేట్ అందుకోనున్న కలెక్టర్..
Narasapuram Lace
Follow us on

ప్రపంచం ప్రసిద్ధి గాంచిన ఆంధ్ర లేస్ ఉత్పత్తులకు ఈ సంవత్సరం జులై నెల లొ అంతర్జాతీయ బౌగోళిక గుర్తింపు లభించింది. ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ నిర్వహించే వర్క్ షాప్ లొ అంతర జాతీయ బౌగోళిక గుర్తింపు పత్రాన్ని పశ్చిమ గోదావ జిల్లా కలెక్టర్ నాగరాణి అందుకున్నారు. నరసపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ గుర్తింపు దక్కనుంది. చేతితో తయారు చేసిన ప్రత్యేక ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజీ లక్ష్యంగా కేంద్ర జౌళి శాఖఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లేసు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జియో గ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇక్కడి ఉత్ప త్తులకు ప్రపంచ గుర్తింపు లభించునుంది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చేతి అల్లికలకు డిమాండ్ పెరగడంతో పాటు మహిళలకు మరింత ఉపాధి దొరకనుంది. గతంలోనే నరసాపురం మహిళలు అధునాతన డిజైన్లు తయారు చేయడానికి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, వారు తయారు చేసిన లేస్ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునెందుకు నరసాపురం లోని సీతారాంపురంలో కేంద్ర జౌళిశాఖ ఆధ్వర్యంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 2000 సంవత్సరం లో లేస్ పార్క్ ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానంగా 51మహిళా సొసైటీలు ఏర్పాటు చేసి, మహిళలకు అల్లికల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, శ్రమకు తగిన ఫలితం దక్కేందుకు వీలుగా డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో అలంకృతి మినీ లేసుపార్కుల పేరిట భవనాలు నిర్మిం చారు. ఆధునిక లేసు కుట్టు యంత్రా లను సైతం కొనుగోలు చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించారు. 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లి కలు చేసేవారు. దాదాపు 2 వేల కుటుం బాలు ప్రత్యక్షంగా లేను పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు .

గతంలో నరసాపురం నుండి ప్రతి సంవత్సరం రూ.250 కోట్ల వ్యాపారం జరిగేది. గతంలో ఇక్కడ నుంచి ఏటా రూ.250 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. చైనాలో యాంత్రీ కరణ అందుబాటులోకి రావడం, తక్కువ ధరలకు లేసు ఉత్పత్తులు లభించడంతో క్రమంగా ఇక్కడ మహిళలకు ఉపాధి దూరమైంది. తాజాగా దక్కిన గుర్తింపుతో ఇక్కడి ఉత్తత్తులకు మళ్ళీ పునర్వైభవం రానుందని లేస్ కుట్టు మహిళలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..