జగన్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు.. మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడతారా..? మీకసలు సిగ్గుందా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇంతకు దిగజారుతారానుకోలేదన్నారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు.. ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. పాఠశాలలో ఉన్న పరిస్థితిని.. బయటి సమాజానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. దీనిని […]

జగన్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్..

Edited By:

Updated on: Jan 24, 2020 | 4:35 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు.. మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడతారా..? మీకసలు సిగ్గుందా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇంతకు దిగజారుతారానుకోలేదన్నారు.

విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు.. ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. పాఠశాలలో ఉన్న పరిస్థితిని.. బయటి సమాజానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే.. మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుందంటూ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు.. 2430 జీవో ద్వారా మీ నియంతృత్వ ధోరణిని మరోసారి చాటుకున్నారంటూ విమర్శలు గుప్పించారు.