AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: నారా లోకేష్‌కు లంచ్‌ బ్రేక్‌.. మొదటి సెషన్‌లో 3గంటలపాటు ప్రశ్నించిన సీఐడీ

లోకేష్‌ను ప్రశ్నించింది సీఐడీ. IRR అలైన్‌మెంట్‌ మార్పు... మీకు ముందే ఎలా తెలుసు?, మూడుసార్లు అలైన్‌మెంట్‌ మార్చడం వెనుక మీ పాత్ర ఉందా?, హెరిటేజ్‌కి లబ్ధిచేకూర్చేందుకే అలైన్‌మెంట్‌ మార్చారా?, మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులోనే ఎందుకు భూములు కొన్నారు?. అలైన్‌మెంట్‌ మార్పు గురించి చంద్రబాబే మీకు చెప్పారా?, లింగమనేని రమేష్‌తో మీకున్న సంబంధాలు ఏంటి?, ఇలా ప్రశ్నిస్తోంది సీఐడీ.

Nara Lokesh: నారా లోకేష్‌కు లంచ్‌ బ్రేక్‌.. మొదటి సెషన్‌లో 3గంటలపాటు ప్రశ్నించిన సీఐడీ
Nara Lokesh
Sanjay Kasula
|

Updated on: Oct 10, 2023 | 1:54 PM

Share

అమరావతి, అక్టోబర్ 10: ఇన్నర్ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుపైనే ప్రధానంగా లోకేష్‌ను ప్రశ్నించింది సీఐడీ. IRR అలైన్‌మెంట్‌ మార్పు… మీకు ముందే ఎలా తెలుసు?, మూడుసార్లు అలైన్‌మెంట్‌ మార్చడం వెనుక మీ పాత్ర ఉందా?, హెరిటేజ్‌కి లబ్ధిచేకూర్చేందుకే అలైన్‌మెంట్‌ మార్చారా?, మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులోనే ఎందుకు భూములు కొన్నారు?. అలైన్‌మెంట్‌ మార్పు గురించి చంద్రబాబే మీకు చెప్పారా?, లింగమనేని రమేష్‌తో మీకున్న సంబంధాలు ఏంటి?, ఇలా ప్రశ్నిస్తోంది సీఐడీ.

ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో నారా లోకేష్‌ అలా విచారణకు హాజరయ్యారో లేదో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించనివిధంగా ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను మార్చేసింది సీఐడీ. ఇప్పటివరకు కేసును దర్యాప్తు చేస్తోన్న అడిషనల్‌ ఎస్పీ జయరామరాజును ఐవో బాధ్యతల నుంచి తొలగించింది. ఆ ప్లేస్‌లో డీఎస్పీ విజయ్‌ భాస్కర్‌కు ఛార్జ్‌ అప్పగించింది. ఆమేరకు ఏసీబీ కోర్టుకు సమాచారమిస్తూ మెమో దాఖలుచేసింది సీఐడీ.

  • ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో ఊహించని పరిణామం
  • ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను మార్చిన సీఐడీ
  • ఐవో బాధ్యతల నుంచి అడిషనల్‌ ఎస్పీ జయరామరాజు తొలగింపు
  • ఇకపై దర్యాప్తు అధికారిగా వ్యవహరించనున్న డీఎస్పీ విజయ్‌ భాస్కర్‌
  •  ఐవో మార్పుపై ఏసీబీ కోర్టుకు సమాచారమిస్తూ సీఐడీ మెమో

లోకేష్ ను అడిగిన ప్రశ్నలు ఇవేనా..!

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చారు?
  • హెరిటేజ్‌ ఫుడ్స్‌కి లాభం చేకూర్చేందుకే మార్పులు జరిగాయా?
  • భూముల విలువ పెరిగేలా లింగమనేని రమేష్‌ వేసిన స్కెచ్‌ ఏంటి?
  • కంతేరులో హెరిటేజ్‌ ఫుడ్స్‌కి 10.4 ఎకరాలు ఎప్పుడు కొనుగోలు చేశారు?
  • హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఎప్పుడెప్పుడు డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు?
  • హెరిటేజ్‌ ఫుడ్స్‌లో మీ షేర్లు, వాటాలు ఎంత?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం