Nara Lokesh: రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్.. బాలిక ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్

రాప్తాడు జిల్లాలో దాడికి గురై ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి బాలికను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరామర్శించి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల నివేదిక ప్రకారం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం బాలిక స్పృహలోనే ఉందని, ఆమెను తల్లి కూడా పరామర్శించిందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుండటంతో ఈరోజు సాయంత్రం వెంటిలేటర్‌ సపోర్ట్‌ను తొలగించాలని వైద్యులు భావిస్తున్నట్టు తెలిపారు.

Nara Lokesh: రాప్తాడు ఘటన బాధితురాలిని పరామర్శించిన మంత్రి లోకేష్.. బాలిక ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్
Minister Nara Lokesh Reviews Anantapur Girls Health At Hospital

Updated on: Nov 02, 2026 | 11:52 AM

అనంతపురం జిల్లా రాప్తాడు అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే.. బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లిన మంత్రి లోకేష్‌.. బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. బాలికకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. దీంతో.. బాలికకు అవసరమైన సర్జరీలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి లోకేష్‌కు వైద్యులు తెలిపారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

ఐసీయూలో బాలిక ఆరోగ్య పరిస్థితిన తెలుసుకున్న తర్వాత.. ఆస్పత్రిలోనే ఉన్న బాలిక తల్లిదండ్రులను మంత్రి నారా లోకేష్‌ పరామర్శించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా.. మంత్రి లోకేష్‌ ముందు బాలిక తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోగా అధైర్య పడొద్దంటూ ఓదార్చారు. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పోస్ట్ చూడండి..

అలాగే.. ఘటన ఎలా జరిగిందనే దానిపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్‌. చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు.. అత్యుత్తమ వైద్యం, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థుల్లో ఏర్పడిన భయాందోళనలను తొలగించి తిరిగి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వచ్చేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇక.. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి అదే వారికి చివరి రోజు అవుతుందని మంత్రి లోకేష్‌ మరోసారి హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us