Chandrababu Protest: తిరుపతి ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల తీరుకు నిరసనగా బైఠాయించిన చంద్రబాబు..

|

Mar 01, 2021 | 1:00 PM

Chandrababu Agitation: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరును..

Chandrababu Protest: తిరుపతి ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల తీరుకు నిరసనగా బైఠాయించిన చంద్రబాబు..
Follow us on

Chandrababu Agitation: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఫ్లోర్‌పైనే కూర్చున్నారు. దాంతో పోలీసులు ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు.. చిత్తూరుకు వెళ్లకుండా హైదరాబాద్‌కు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలేం జరిగిందంటే.. వైసీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టేందుకు టీడీపీ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి, తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధరాత్రి అనుమతి నిరాకరిస్తున్నట్టు, సోషల్ మీడియాలో తమకు విషయం తెలిసినట్టు టీడీపీ నేతల ఇండ్లకు పోలీసులు నోటీసులు అతికించారు.

పోలీసుల నిషేధాన్ని పట్టించుకోని చంద్రబాబు సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలిపిందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేది లేదంటూ తేల్చి చెప్పారు. దాంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి వెనక్కి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read:

Peddagattu Jathara : ఘనంగా ప్రారంభమైన ఆసియాలో రెండో అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు

మొదటి సారి కోవిద్ వాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ..నేటి నుండి రెండవ దశ వ్యాక్సినేషన్ డ్రైవ్:PM Modi Takes Covid Vaccine Photos.