AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Award 2025: తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ ఎవరెవరికంటే.. లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ

Padma Award 2025: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు..

Padma Award 2025: తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ ఎవరెవరికంటే.. లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ
Subhash Goud
|

Updated on: Jan 25, 2025 | 9:26 PM

Share

రిపబ్లిక్‌ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది. ముగ్గురు విదేశీయులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. కువైట్ యోగా ట్రైనర్ అల్ సబాహ్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్, నేపాల్ జానపద గాయకుడు నరేన్ గురుంగ్‌ను పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్రం. గోవాకు చెందిన వంద ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు లిబియా లోబో సర్దేశాయ్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ, ఏపీ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, మదుగుల నాగభూషణ్ శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీకి ఎంపికయ్యారు.

  • హర్యానాకు చెందిన పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్‌ సింగ్
  • బీహార్ సామాజిక కార్యకర్త భీమ్ సింగ్ భవేష్
  • పుదుచ్చేరి డోలు వాయిద్యకారుడు దక్షిణమూర్తి
  • వ్యవసాయంలో నాగాలాండ్‌ చెందిన ఎల్. హంగ్ థింగ్‌
  • మధ్యప్రదేశ్‌కు చెందిన జానపదగాయకుడు బేరు సింగ్ చౌహాన్‌
  • యాపిల్ సాగుదారు హరిమన్ శర్మ
  • అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త జుమ్టే యోమ్‌మ్ గామ్లిన్‌
  • మహారాష్ట్ర హోమియోపతి వైద్యుడు విలాస్ దాంగ్రే
  • కర్ణాటకకు చెందిన జానపద గాయకుడు వెంకప్ప అంబానీ సుగటేకర్‌
  • చేతివృత్తుల రంగంలో బీహార్‌కు చెందిన నిర్మలా దేవి
  • అసోం థింసా కళాకారుడు జోయ్నచరణ్ బతారీ
  • గుజరాత్‌కు చెందిన ప్రజావైద్యుడు సురేశ్ సోనీరి
  • ఉత్తరాఖండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్‌
  • ఛత్తీస్‌గఢ్‌ కళాకారుడు పాండి రామ్ మాండవి
  • కళల విభాగంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోకుల్‌ చంద్ర దాస్‌
  • చేనేత విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాల్లీ హోల్కర్‌కు
  • గుజరాత్‌కు చెందిన పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌
  • సాంస్కృతిక రంగంలో సేవలందించిన మారుతీ భుజరంగ్‌రావు
  • జానపద కళాకారిణి బతూల్‌ బేగమ్‌
  • డప్పు వాయిద్యకారుడు వేలు ఆసన్‌
  • తోలుబొమ్మలాటలో భీమవ్వ దొడ్డబాలప్ప
  • వైద్యరంగంలో విశేష సేవలందించిన విజయలక్ష్మి దేశ్‌మానే, నీర్జా భట్లా..
  • సాహిత్యరంగంలో సేవలందించిన జగదీశ్‌ జోషిలా, హ్యూకొల్లీన్‌ గాంట్జర్‌ పద్మ అవార్డులకు ఎంపికయ్యారు