ప్రాణం ఉన్నంతవరకు ముఖ్యమంత్రి జగనన్నతోనే ఉంటానని.. ఆయన కోసమే పనిచేస్తానని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా(RK Roja) స్పష్టం చేశారు. నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేనని వెల్లడించారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే రోజా. కానీ జగనన్న తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందున సినిమా షూటింగ్‌లు మానేస్తున్నట్లుగా ప్రకటించారు. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.
సినిమాలకు, జబర్దస్‌కు రోజా ఇక దూరం..
నటి, ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా (RK Roja)కు మంత్రి పదవి దక్కింది. ఫుల్ కాంపిటీషన్ మధ్య రోజా మంత్రి పదవి దక్కించుకుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది ఆశావహులు ఉండగా.. మంత్రి పదవి రోజాను వరించింది. గత వారం రోజుల నుంచి ఏపీకి కొత్త మంత్రులు (AP Cabinet) ఎవరనే విషయంపై పెద్ద చర్చే నడిచింది. పూర్తిగా కొత్త కొత్తవారితో మంత్రి వర్గం ఉంటుందా లేక పాత కొత్త వారితో కలిపి సరికొత్త మిశ్రమం ఉంటుందా? ఒక వేళ పాత వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే వారెవరు? ఇలా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. చివరికి చాలా మంది కొత్త వారికి అవకాశం దక్కింది. ఇదే సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నగరి రోజాకు మంత్రి పదవి దక్కింది.
ఈసారి సీఎం జగన్ బీసీలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎటువంటి సిఫార్స్లు పట్టించుకోకుండా మంత్రి పడవలు ఇచ్చారు. ఇంత పకడ్బందీగా సాగిన మంత్రి పదవుల కేటాయింపులో రోజాకు ముందే కొన్ని విషయాలు తెలుసని బుల్లితెర షోల కారణంగా కొందరు నిర్ధారిస్తున్నారు. దీనికి రుజువుగా కొన్ని విషయాలు వాళ్ళు విశదీకరిస్తున్నారు. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్స్ పరిశీలిస్తే… రోజా తన పార్ట్ తగ్గించుకుంటూ వస్తుంది.
ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..
Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..