నాలుగు సంవత్సరాల దర్యాప్తు.. వందల సంఖ్యలో సాక్షులు, మారిన ఐదు దర్యాప్తు బృందాలు.. పలు కోర్ట్ లలో పిటిషన్ లు…చివరికి 10 మంది నిందితులు .ఇది గత నాలుగేళ్లుగా వివేకా హత్య కేసు మిస్టరీలో బయటపడ్డ వాస్తవాలు..నాలుగు సంవత్సరాలుగా సిబిఐ దర్యాప్తు కు శుక్రవారం ముగింపు పడిందా? వివేక హత్య కేసు లో సిబిఐ దర్యాప్తు ముగిసినట్టేనా?? జూన్ 30 వరకు ఉన్న గడువు పూర్తి కావడంతో ఇక కేస్ ను సిబిఐ దర్యాప్తు చేయదా ? సుప్రీం కోర్టు లో గడువు పొడగించాలని సిబిఐ కోరలేదు కాబట్టి సిబిఐ దర్యాప్తు ముగిసినట్టే భావిస్తున్నారు.. .శుక్రవారం సిబిఐ కోర్టులో ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ..ఐతే ఛార్జ్ షీట్ లో ఎవరి పేర్లు చేర్చింది?? ఎలాంటి అంశాలను సిబిఐ పొందపరిచిందనే అంశం పై సప్సెన్స్ కొనసాగుతూనే ఉంది.
మార్చ్ 15 2019లో వై ఎస్ వివేకా హత్య.. శమీం స్టేట్మెంట్ నుండి సీల్డ్ కవర్ స్టేట్మెంట్స్ దాకా ప్రతిదీ సంచలనమే.. 600 పేజీల సాక్షుల వాంగ్మూలాలు ఒక ఎత్తైతే… సిబిఐ చివరి చార్జిషీట్ మరో ఎత్తు.. వివేక హత్య జరిగిన నాలుగు సంవత్సరాలకు సిబిఐ తుది దర్యాప్తును ముగించింది.. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన సిబిఐ తాజాగా సీ బి ఐ కోర్టులో మరో అనుబంధం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది… సుమారు 300 పైబడి పేజీలతో ఉన్న చార్జ్ షీట్ ను శుక్రవారం ఉదయం సిబిఐ కోర్టులో ఫైల్ చేసారు అధికారులు..
వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తుకు పులిస్టాప్ పడింది. వివేక కేసు విచారించేందుకు సిబిఐ కి జూన్ 30 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో శుక్రవారం హైదరాబాద్ సిబిఐ కోర్టులో చివరి చార్షీట్ ఫైల్ చేసింది సిబిఐ. 2021లో మొదటి చార్జీ షీట్ దాఖాల్ చేసింది సిబిఐ. 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ.. మొదటి ఛార్జ్ షీట్ లో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను చార్జిషీట్లో చేర్చింది సిబిఐ. ఇక సప్లమెంటరీ చార్జ్ షీట్ లో దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి పేరును చేర్చింది. సిబిఐ మూడో చార్జ్ షీట్ లో ఉదయ్ కుమార్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లతో పాటు ఇద్దరు అనుమానితుల పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చింది..
చార్జిషీట్ దాఖలు సందర్భంగా ఫైనల్ రిపోర్ట్ పేరుతో సిబిఐ కోర్టులో సబ్మిట్ చేశారు. నాలుగేళ్లుగా సీ బిఐ జరిపిన దర్యాప్తు ఒక ఎత్తు, ఈ ఏడాది జనవరి నుండి సిబిఐ జరిపిన దర్యాప్తు మరో ఎత్తులా కనిపించింది .. వైయస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారాడు ఏ4 నిందితుడు దస్తగిరి.. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఏ 6, 7, 8 నిందితులను ఇరికించారు అనే వాదన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాదులు వాదించారు.. చివరకు సిబిఐ జరిపిన దర్యాప్తులో అనేక లోసుగులు ఉన్నాయి అంటూ తెలంగాణ హైకోర్టు వాక్యానించింది..అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ సందర్భంగా దర్యాప్తులో ఉన్న సిబిఐ లోపాలను ఎత్తి చూపింది హై కోర్ట్. దీంతో అవినాష్ రెడ్డికి ముందస్త్ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టులో దీన్ని ఆపిల్ చేసింది వివేక కూతురు సునీత రెడ్డి. జులై మూడున అప్పీల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది.
మరోవైపు సిబిఐ దర్యాప్తులో పలు అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వివేకా హత్య సమయంలో స్పాట్లో దొరికిన సూసైడ్ లెటర్ ను నిన్ హైడ్రీన్ టెస్ట్ కోసం సెంట్రల్ ఫారెన్సీక్ ల్యాబ్ కు పంపించారు. సిఎఫ్ఎస్ఎల్ నుండి సూసైడ్ లెటర్ కు సంబంధించిన రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది..
మొత్తం నాలుగు సంవత్సరాల పాటు అనేక సాక్షాదారాలను సేకరించిన సిబిఐ 7 గురుని అరెస్ట్ చేయగల్గిoధి.. సుప్రీంకోర్టులో గడువు పొడవు గింపు గురించి ఎలాంటి మెన్షన్ సిబిఐ చేయలేదు కాబట్టి దర్యాప్తు ముగిసినట్టే అని చర్చ జరుగుతుంది… మరో వైపు ప్రతి శనివారం సిబిఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరు అవుతునే ఉన్నాడు.. ఇప్పటికే సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి, రేపు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ కు హాజరవుతారా లేదా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం