Gold mining: ఆంధ్రలో బయటపడ్డ బంగారం గనులు.. తవ్వినోళ్లకు తవ్వినంత..!

Gold mining: ఆంధ్రలో బయటపడ్డ బంగారం గనులు.. తవ్వినోళ్లకు తవ్వినంత..!

Anil kumar poka

|

Updated on: Jun 30, 2023 | 8:24 PM

గత కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఏపీ లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

గత కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఏపీ లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలు ఎక్కడెక్కడ ఎంతెంత బంగారం నిల్వలు ఉన్నాయో సర్వే చేసి సమాచారాన్ని సేకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఉన్న ‘చిగురుగుంట-బిసనట్టం’ బంగారు గని అందులో ఒకటి. ఈ ఒక్క గనిలోనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు అంచనా. ఒక్కో టన్ను ఖనిజం నుంచి దాదాపు 5 గ్రాములకు పైనే బంగారం లభిస్తుందని నిర్ధారించారు. ఇప్పుడు ఈ గనిలో ఎన్‌ఎండిసి తవ్వకాలు మొదలు పెట్టనుంది.

చిగురుగుంట- బిసనత్తమ్‌ బంగారం గనిలో తవ్వకాలు నిర్వహించడానికి ఆసక్తితో ముందుకు వచ్చిన ఎన్‌ఎండీసీ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఎల్‌ఓఐ పై సంతకాలు కూడా చేసింది. దీనికి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైనింగ్‌ లీజు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర అనుమతులు తీసుకోవడంతో పాటు పర్యావరణ అనుమతి కూడా సంపాదించాలి. అనుమతుల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లడం కోసం కన్సల్టింగ్‌ సంస్థను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అన్ని పనులు వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి బంగారం గని తవ్వకాలు ప్రారంభించాలనేది ఎన్‌ఎండీసీ ఆలోచనగా తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..