Andhra Pradesh: భూమిలోంచి వింత శబ్ధాలు.. చిత్తూరు జిల్లా వాసులు హడల్‌!

|

Nov 11, 2021 | 7:24 PM

చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్ధాలు రావటం కలకలం రేపింది. ఈ మిస్టీరియస్ శబ్ధాలతో స్థానికులు భయాందోళలనకు లోనవుతున్నారు.

Andhra Pradesh: భూమిలోంచి వింత శబ్ధాలు.. చిత్తూరు జిల్లా వాసులు హడల్‌!
Mysterious Sounds From Earth
Follow us on

చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్ధాలు రావటం కలకలం రేపింది. జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, ఎర్రెపల్లి పంచాయతీ, అబ్బగుండు గ్రామంలో భూమిలో నుండి వింత శబ్దాలు రావడంతో పాటు, భూమి కంపించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలియటంతో ఐరాల మండల ఎమ్మార్వో బెన్ రాజ్, ఎంపిడిఓ నిర్మలాదేవి హుటాహుటినా ఆ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు గ్రామ ప్రజలను విచారించగా.. గత 10 రోజులుగా గ్రామంలో రాత్రి పూట వింత శబ్దాలు వచ్చేవని, కానీ గత రెండు రోజులుగా పగటి పూట కూడా భూమిలో నుంచి వింత శబ్దాల రావడంతో పాటు భూమి కంపిస్తుందని తెలిపారు.  గ్రామంలో ఉన్న ఇళ్లలోని గోడలు బీటలు వారుతున్నాయని.. భూమి కంపిస్తుడడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని వివరించారు. దీనికి మైనింగ్‌ కార్యకలాపాలే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఐరాల యస్.ఐ. హరిప్రసాద్, సిబ్బందితో కలిసి అబ్బగుండు గ్రామానాన్ని సందర్శించారు. ఆ సమయంలోనూ భూమి నుంచి శబ్దాలు వచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాల ఎంపీడీఓ, మైనింగ్ అధికారులకు తెలియజేసారు. చిత్తూరు మైనింగ్ ఏడి ప్రకాష్ కుమార్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన అనంతరం… వింత శబ్ధాలు గల కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని కోరారు.

Also Read: నడి ఎడారిలో పాపడాల ఫ్రై… వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడ ఉందో కనిపెడితే మీరు గ్రేటే.. ఒక్కసారి ట్రై చేయండి