Funerals to Covid Victims: జయహో యువత.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. కరోనా మృతులకు ఇస్లామిక్ హెల్పింగ్‌ హ్యాండ్స్

|

May 11, 2021 | 8:19 AM

ఆపదలో వున్న సాటి వారికి అండగా నిలవడమే అసలు సినలు మంచితనం. అనంతపురం జిల్లా ముదిగుబ్బ యువత అంతకు మించిన సత్కార్యాలు చేస్తున్నారు.

Funerals to Covid Victims: జయహో యువత.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. కరోనా మృతులకు ఇస్లామిక్ హెల్పింగ్‌ హ్యాండ్స్
Funerals
Follow us on

Muslim Islamic helping hands: ఆపదలో వున్న సాటి వారికి అండగా నిలవడమే అసలు సినలు మంచితనం. అనంతపురం జిల్లా ముదిగుబ్బ యువత అంతకు మించిన సత్కార్యాలు చేస్తున్నారు. కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయిత స్థితిలో వున్న వారికి ఆ యువకులే ఆ నలుగురిగా తోడునీడవుతున్నారు. మానవత్వం ఇంకా బతికే వుందనే సాదృశ్యం అవుతోంది.

కరోనా విజృంభణతో జనం పిట్లల్లా రాలుతున్నారు. ఓవైపు వ్యాక్సిన్‌ కొరత.. మరోవైపు ఆక్సిజన్‌ షార్టేజ్‌.. బెడ్డు దొరక్క.. వైద్యం అందక ఎంతో మంచి కళ్లెదుట చనిపోతున్నారు. మృతులకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేని నిస్సహాయత కన్నీరు పెట్టిస్తోంది. ఇదే అదనుగా చావుల్ని కూడా క్యాష్‌ చేసుకుంటున్నారు కేటుగాళ్లు . అంత్యక్రియాలు చేయడానికి వెళ్తే శ్మశానాల్లో అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారు. డబ్బులు ఉన్నోడికే దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. లేనివాడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కొన్ని చోట్ల కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రావడంలేదు. మరికొన్ని చోట్ల తమ ఏరియాలోని శ్మశనవాటికల్లో కరోనా డెడ్‌బాడీస్‌కు అంత్యక్రియలు చేయోద్దని స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా యువకులు ముందుకు వచ్చారు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ సహాయం చేసేందుకు సిద్దమయ్యారు. అనాథలుగా కాకుండా సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు చేస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.

మానవత్వం ఇంకా బతికే వుందని ..మానవీయత ముఖ్యమని చాటే చెప్పే ఘటనలకు సెల్యూట్‌ చేయాల్సిందే. అలాంటి మంచితనం అనంతపురంలో పరిమళిస్తోంది. ముస్లిమ్‌ ఇస్లామిక్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ స్వచ్చంద సంస్థ తరపును స్థానిక యువకులు సామాజిక బాధ్యత అనే మాటకు ప్రాణం పోస్తున్నారు. కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. మందులు , ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు సగౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు ముదిగుబ్బ యువత.తమ సాయం అవసరమని భావిస్తే తమకు కానీ.. లేదంటే ముదిగుబ్బ పోలీసులకు కానీ సమాచారం ఇస్తే ఎనీ టైమ్‌ ఎలాంటి సాయం చేయడానికైనా తాము సిద్ధమంటున్నారు.

బంధుత్వం.. అనుబంధం కన్నా మానవత్వం ముఖ్యం. ముదిగుబ్బ యువత చేస్తున్న సేవా కార్యక్రమలను సకల జనులు హర్షిస్తున్నారు. వీరి స్పూర్తితో మరెంతో మంది సామాజిక సేవకు ముందుకు కదులుతున్నారు.

Read Also…. మాస్క్‏పై బంగారు ముక్కు పుడక.. ఆ మహిళ తెలివి అదుర్స్ అంటున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..