Municipal Workers: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నూత్నంగా నిరసన.. కంగుతిన్న అధికారులు

ఎక్కడైనా వీధుల్లో ఉన్న చెత్తనంతా తీసుకొని వెళ్లి యార్డ్‎లో పోయడం అనేది పారిశుద్ధ్య కార్మికుల విధి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గడచిన పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరంలో రోడ్లన్నీ చెత్తతో నిండిపోవడంతో అధికారులు ఎవరి చెత్తను వారి ఇళ్లల్లోనే పెట్టుకోవాలంటున్నారు. ఇంటి వద్దకే వచ్చి కొత్తగా నియమించి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తీసుకెళ్తారని తెలిపారు.

Municipal Workers: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నూత్నంగా నిరసన.. కంగుతిన్న అధికారులు
Municipal Sanitation Workers

Edited By:

Updated on: Jan 04, 2024 | 9:57 PM

ఎక్కడైనా వీధుల్లో ఉన్న చెత్తనంతా తీసుకొని వెళ్లి యార్డ్‎లో పోయడం అనేది పారిశుద్ధ్య కార్మికుల విధి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గడచిన పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరంలో రోడ్లన్నీ చెత్తతో నిండిపోవడంతో అధికారులు ఎవరి చెత్తను వారి ఇళ్లల్లోనే పెట్టుకోవాలంటున్నారు. ఇంటి వద్దకే వచ్చి కొత్తగా నియమించి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తీసుకెళ్తారని తెలిపారు. అయితే గతంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమణ తర్వాత పనుల్లోకి వస్తారు చెత్త తీసుకెళ్తారని సూచన చేస్తున్నారు.

గత 10 రోజులుగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అనంతపురం పట్టణంలో వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వీధుల్లో ఉన్న చెత్తంతా ఓ ట్రాక్టర్లో ఎక్కించి అనంతపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారబోశారు. దీంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అయ్యారు. ఎందుకంటే గతంలో అనేక మున్సిపాలిటీల పరిధిలో ఎవరైనా చెత్త పన్ను కట్టకపోతే, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే చెత్త తీసుకొని వారి ఇళ్ళ ముందు, షాపులు ముందు పోసేవారు. అలాంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ తమ సమస్యల పరిష్కారం కోరుతూ తిరిగి అదే చెత్తను మున్సిపల్ ఆఫీసులో పోయడంతో అనంతపురం మున్సిపల్ అధికారులు కంగుతున్నారు.

చెత్త పై పన్ను వసూలు చేసిన అధికారులను ఇప్పుడు ఈ చెత్త ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో అనంతపురం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ నిండా చెత్త తీసుకొని వచ్చి కార్యాలయ ఆవరణలో పోసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us