Andhra Pradesh: కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసుల ఉపసంహరించుకోవడంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదలు తెలిపారు ఆయన. ఈ మేరకు శుక్రవారం నాడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. కేసులు ఉపసంహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు అన్యాయం అని పేర్కొన్నారు.
‘‘మా జాతి నన్ను ఉద్యమం నుంచి తప్పించినా, తమ ద్వారా ఆ కేసులకు మోక్షం కలిగించారు. కాపులను బీసీ – ఎఫ్ లో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలపాలనుకున్నా. అలా చేస్తే జాతిని పదవుల కోసం, డబ్బులు కోసం అమ్మేసుకున్నాను అని అంటారని భయపడ్డా. ఇప్పుడు కూడా ఆ భయంతోనే మిమ్మల్నీ కలవలేకున్నాను. చాలా మంది పెద్దలు రకరకాల సమస్యలతో మీ ఇరువురి వద్దకు వచ్చినా తప్పు పట్టారు. నేను మాత్రమే ఎవరినీ కలవకూడదు, నేను ఎప్పుడో చేసుకున్న పాపం అనుకుంటాను’’ అంటూ ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు చెబుతూనే ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి కాపు సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఉపసంహరించుకున్నందుకు సీఎం జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోభాగంగానే విజయవాడలోని కాపు సంఘాల నేతలు సీఎం జగన్ చిత్రపాటానికి పాలాభిషేకం చేశారు.
Also read:
High BP Symptoms: అధిక రక్తపోటును ముందే గుర్తించండి.. అది సైలెంట్ కిల్లర్ అని మరిచిపోవద్దు..