జనసేన నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారు.. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: ముద్రగడ సన్నిహితులు

|

Jun 24, 2023 | 9:23 PM

వాస్తవంగా విజయవాడలో ఉన్న ఫ్లాట్ గాని ముద్రగడ పద్మనాభానికి  ఎలాంటి సంబంధం లేదు. ముద్రగడ పద్మనాభంను అందరూ ఆహ్వానించి పూజలకు కూడా పిలుస్తారన్నారు. పోతిన మహేష్ విడుదల చేసిన లెటర్ పచ్చి అబద్ధం.

జనసేన నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారు.. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: ముద్రగడ సన్నిహితులు
Mudragada Vs Pawan Kalyan
Follow us on

ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలపై తిరిగి కౌంటర్ ఇస్తున్నారు జనసేన నేతలు. ఈక్రమంలోనే ముద్రగడతో టీవీ9 మాట్లాడే ప్రయత్నం చేసింది అన్నిటికీ త్వరలోనే మీరే ముఖంగా సమాధానం చెబుతాను అంటున్నారు ముద్రగడ. జనసేనలో మాట్లాడుతున్న ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి లేఖ గాని , నేరుగా గాని స్పందించాలని టీవీ9 చిట్ చాట్ లో తెలిపారు ముద్రగడ. ఆయన ఎక్కడికి పారిపోరంటున్నారు. మరోవైపు ముద్రగడ లేఖన ఉద్దేశించి మాట్లాడుతున్న జనసేన నేతలపై మండిపడ్డారు ముద్రగడ బంధువులు సన్నిహితులు. ముద్రగడ పద్మనాభం ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళేటప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ముద్రగడను విమర్శించారన్నారు ముద్రగడ సమీప బంధువు చిన వెంకన్న దొర. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కి రెండు లెటర్లు రాశారు ఆ లెటర్ ను ఉద్దేశించి జనసేన చిన్న స్థాయి నాయకులు మాట్లాడటం చాలా పొరపాటు . వాస్తవంగా విజయవాడలో ఉన్న ఫ్లాట్ గాని ముద్రగడ పద్మనాభానికి  ఎలాంటి సంబంధం లేదు. ముద్రగడ పద్మనాభంను అందరూ ఆహ్వానించి పూజలకు కూడా పిలుస్తారన్నారు. పోతిన మహేష్ విడుదల చేసిన లెటర్ పచ్చి అబద్ధం. స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించి సంతకం పెట్టి విడుదల చేస్తే దానికి సమాధానం చెప్పే సత్తా ముద్రగడ పద్మనాభం వద్ద ఉందన్నారు ముద్రగడ బంధువులు. పద్మనాభం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి. తప్పుడు విధానాలు మా దగ్గర ఉండవు. జనసేన నేతలే తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు.

ముద్రగడ పద్మనాభం ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. దీనికి సంబంధించి ప్రతివాడు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు ముద్రగడ పద్మనాభం సన్నిహితులు. ముద్రగడ పోటీ విషయంలో పవన్ సవాలు బట్టే నిర్ణయం ఉంటుందనీ దేనికైనా ముద్రగడ పద్మనాభం సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన చెప్తున్నావన్ని అబద్ధాలనీ ముద్రగడ పద్మనాభం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన్ని విమర్శించరన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముద్రగడ పద్మనాభానికి ఎప్పటినుంచో సన్నిహితులు. రాజకీయానికి దానికి ముడి పెట్టొద్దనీ దానికి సంబంధం లేదన్నారు. మొత్తానికి గోచి మొలతాడు లేని వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటున్నారు ముద్రగడ సన్నిహితులు.

ఇవి కూడా చదవండి

– సత్య, టీవీ 9 రిపోర్టర్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..