Raghu Rama Krishna Raju: సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన లేఖ (Latter)లో కోరారు. అయితే పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామ అన్నారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. హత్య వెనుక ఉన్న మాస్టల్ మైండ్ ఎవరో తేల్చాలని, ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకూ భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు మార్చిలో వైఎస్ వివేకానందరడ్డి హత్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమందిని విచారించారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నిందితులను అదుపులోకి విచారించగా, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. భూవివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు లేఖపై సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి: