Andhra Pradesh: లోకేష్‌ను ఏమైనా అధ్యక్షుడిని చేశాడా? చంద్రబాబుకు మోపిదేవి స్ట్రాంగ్ కౌంట్..

Andhra Pradesh: వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ వియలక్ష్మి రాజీనామా చేయడంపై విపక్షాలు చేస్తున్న వ్యా్ఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు..

Andhra Pradesh: లోకేష్‌ను ఏమైనా అధ్యక్షుడిని చేశాడా? చంద్రబాబుకు మోపిదేవి స్ట్రాంగ్ కౌంట్..
Mopidevi

Updated on: Jul 10, 2022 | 4:44 PM

Andhra Pradesh: వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ వియలక్ష్మి రాజీనామా చేయడంపై విపక్షాలు చేస్తున్న వ్యా్ఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఇదే అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. వైయస్‌ విజయలక్ష్మి పెద్ద మనసుతో నిర్ణయం తీసుకుని రాజీనామా చేశారని, దీన్ని వివాదాస్పదం చేయడం సరైంది కాదన్నారు. వైయస్‌ జగన్‌ శాశ్వత అధ్యక్షుడిగా ఉండటాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, చంద్రబాబు మాత్రం పార్టీలో కొనసాగడం లేదా అని నిలదీశారు. ఆయన కొడుకు లోకేష్‌ను ఏమైనా అధ్యక్షుడిగా చేశారా? అని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికీ వైసీపీ పార్టీ డిమాండ్‌ చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలు, పోలవరం రివైజ్డ్‌ ఎస్టిమేషన్లు క్లియర్‌ చేయాలని కేంద్ర మంత్రలతో పలు దఫాలుగా విజ్ఞప్తి చేశామని, ఒకదాని తరువాత ఒకటి పరిష్కారమవుతాయని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, ఇది సాధారణ విషయమే అన్నారు. దీనికి, ప్రత్యేక హోదాకు ముడిపెట్టడం సరైంది కాదన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఏపీ రాజకీయ చరిత్రలో ఎవరూ జరపలేని విధంగా జరుపుకున్నామన్నారు. ఈ ప్లీనరీలో కార్యకర్తలకు దిశాదశ నిర్దేశనం చేశామన్నారు.

టీడీపీ మహానాడులో అధికారపక్షంపై విమర్శలు చేశారే కానీ, ఆ పార్టీ ఏం చేయబోతోందని చెప్పలేదని విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సక్సెస్‌ అయిందని, అందుకు అనుగుణంగానే ప్లీనరీకి భారీ సంఖ్యలో ప్రజలు హజరయ్యారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలను అభివృద్ది పథంలో నడిపిస్తున్నామని మోపిదేవి తెలిపారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..