AP News: ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి

|

Aug 26, 2024 | 8:55 PM

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్‌ మంజులగా గుర్తించారు.

AP News: ఇలా చేశావేంటమ్మా..? ఆరు వేలకు శిశువును అమ్మేసిన తల్లి
Child
Follow us on

ప్రకాశం జిల్లాలో ఆడశిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాలల సంరక్షణశాఖ అధికారులు, పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆడ శిశువును పెంచడం ఇబ్బంది కావడంతో తన బంధువుల్లో ఓ మహిళకు 6 వేలకు తన బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఆమెను నెల్లూరు జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్‌ మంజులగా గుర్తించారు. భర్తకు దూరంగా ఉంటూ వేరే వ్యక్తితో సహజీవనం చేస్తుండగా ఆడ శిశువు పుట్టడంతో పెంచలేక అమ్మేసింది. తల్లి నుంచి బిడ్డను తీసుకుని 6 వేలు చెల్లించిన ఆ మహిళ.. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన దంపతులకు పెంచుకునేందుకు 10 వేలకు అమ్మేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఐసిడియస్‌ అధికారుల ఫిర్యాదుతో పొన్నలూరు పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది…ఖమ్మం జిల్లాలో ఉన్న ఆడ శిశువును స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వెనక్కి రప్పించి తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం శిశువును ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ఈనెల 24న ఒంగోలులోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంజుల తన బిడ్డతో సహా వైద్య సిబ్బందికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది… అనంతరం తన ఆడశిశువును ఖమ్మం జిల్లాలోని బాలసుందర్రావు దంపతులకు పెంచుకునేందుకు ఇచ్చేసింది… అందుకుగాను బాలసుందర్రావు 10 వేలు చెల్లించగా తల్లి మంజుల 6 వేలు, బిడ్డను ఇచ్చేందుకు మద్యవర్తిత్వం వహించిన మహిళ 4 వేలు తీసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తల్లి, బిడ్డ ఈనెల 24న చెప్పకుండా వెళ్లిపోయినట్టు తెలుసుకున్న బాలల సంక్షేమ శాఖ సిబ్బంది దీనిపై ఆరా తీశారు. చట్టవ్యతిరేకంగా బిడ్డను మరొకరికి ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తల్లి మంజుల పొన్నలూరులో ఉండటంతో ఆమెపై బాలల సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడశిశువు జన్మించడంతో పోషించలేక వేరే దంపతులు పెంచుకుంటానంటే ఇచ్చానని బిడ్ద తల్లి మంజుల తెలిపారు. శిశు విక్రయం వ్యవహారంలో ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..