Andhra News: వెంటాడిన భయం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు సేఫ్ .. అసలు ఏం జరిగిందో తెలిస్తే!

పడ్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్ప చెల్లించమని అడిగినందుకు ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో అతని చనిపోతే తమపై కేసు అవుతందనే భయంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కుటుంబం కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో తల్లి, కొడుకులు మరణించగా, తండ్రి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు అప్పు తీసుకున్న వ్యక్తికూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Andhra News: వెంటాడిన భయం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు సేఫ్ .. అసలు ఏం జరిగిందో తెలిస్తే!
Andhra News

Edited By: Anand T

Updated on: Sep 18, 2025 | 7:02 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి చిల్లర కొట్టు నడుపతుంటాడు. గ్రామంలో చిన్న, చిన్న ఆర్థిక అవసరాలకు స్థానికులు శ్రీనివాసరావు వద్దకు వచ్చి చేతుబదులు, లేదా అప్పుగా డబ్బు తీసుకుంటారు. అలాగే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూడా శ్రీనివాసరావు వద్ద బైక్ తాకట్టు నలభై వేలు, చేబదులుగా యాభై వేల రూపాయలు తీసుకున్నాడు. అయితే కొద్దీ కాలానికే నలభై వేల రూపాయలు చెల్లించి బైక్ విడిపించుకున్నాడు. ఇక మిగిలిన యాభై వేల రూపాయలు చెల్లించలేకపోయాడు. దీంతో శ్రీనివాసరావుతో పాటు అతని భార్య పూర్ణ కుమారి, కొడుకు వెంకటేష్ కూడా అప్పుడప్పుడు వెంకటేశ్వర్లు తీసుకున్న అప్పు చెల్లించాలని అడిగేవారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం శ్రీనివాసరావు భార్య పూర్ణ కుమారి.. వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి యాభై వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.

Palnadu News

అయితే ఆమె డబ్బులు చెల్లించాలని గట్టిగా అడగడంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు పురగు మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించిగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం కాస్తా శ్రీనివాసరావుకు తెలిసింది. దీంతో కంగారు పడిన శ్రీనివాసరావు ఇంటికెళ్లి భార్య పూర్ణకుమారి,వెంకటేష్ తో గొడవ పడ్డాడు. వెంకటేశ్వర్లు చనిపోతే కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపడ్డారు. ఇక చావు మాత్రమే మిగిలిందని అనుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు కూడా పురుగు మందు త్రాగి చనిపోదామని అన్నాడు. అయితే పురుగు మందు త్రాగటానికి ఒప్పుకోని పూర్ణ కుమారి, వెంకటేష్ తమ వ్యవసాయ పొలంలోని బావిలో దూకి చనిపోతామని చెప్పారు.

ఇంటిలో శ్రీనివాసరావు పురుగు మందు త్రాగడానికి సిద్దం కాగానే పూర్ణ కుమారి, వెంకటేష్ పొలానికి వెళ్లారు. ఇక్కడ శ్రీనివాసరావు పురుగు మందు త్రాగగానే అక్కడ వారిద్దరి బావిలో దూకేశారు. అయితే శ్రీనివాసరావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బావిలో దూకిన పూర్ణ కుమారి, వెంకటేష్ చనిపోయారు. భార్య, కొడుకు చనిపోయిన విషయం తెలియగానే శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆసుపత్రిలో శ్రీనివాసరావు కోలుకుంటున్నాడు. మరొక వైపు వెంకటేశ్వర్లకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులు ఎదుర్కొవాలన్న భయంతోనే ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇద్దరూ చనిపోయిన ఒకరు ఆసుపత్రి పాలుకావడం గ్రామంలో కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.