Andhra Pradesh: వానర చేష్టలతో పల్లె, పట్నం అనే తేడాలేకుండా అందరూ హడలెత్తిపోతున్నారు. ఇండ్లు, దుకాణాలు, షాపులు, పంటపొలాలను నాశనం చేస్తూ.. కోతులు చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. కోతి పనులతో రైతులు, జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక కోతులు గుంపుగా ఉన్నాయంటే.. అక్కడ మామూలు అల్లరి ఉండదు. వాటిని ఎవరైనా బెదిరించినా.. వాటిపై దాడిచేసినా.. రివర్స్ దాడి చేసేందుకు ముందుకు వస్తాయి. అందుకే కోతుల గుంపు ఉంది అంటే ఇక అక్కడ ఎవరూ ఉండరు. అంత దారుణంగా ఉంటాయి వాటి చేష్టలు. అయితే, కోతిమూకలకు చెక్ పెట్టేందుకు జనాలు పక్కా స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల కొండముచ్చులను రంగంలోకి దింపుతున్నారు. కోతులకు సరైన గుణపాఠం చెప్పేది కొండముచ్చులే. అందుకే వాటిని తీసుకువస్తున్నారు జనాలు.
వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో కోతులు విశ్వరూపం చూపిస్తున్నాయి. కోతుల భయంతో తమ పిల్లలను బయటకు పంపేందుకు కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాయోనని హడలి పోతున్నారు. యర్రగొండపాలెం మేజర్ పంచాయితీ నల్లమల అడవికి దగ్గరగా ఉండటంతో, కోతులు ఎక్కువగా వచ్చి చేరాయి. వీటి రాకతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కోతులతో తాము పడుతున్న అవస్థలు పంచాయితీ సర్పంచ్ అరుణాబాయి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి వివరించారు. దీంతో కోతులను ఎలాగైన పారదోలాలని ఫిక్స్ అయ్యారు. ఇందుకోసం ఓ స్కెచ్ వేశారు. అదే కొండముచ్చు. కొండముచ్చు ద్వారా కోతులను తరిమివేయొచ్చని భావించారు. ఇంకేముంది.. జనాల సమస్యను తీర్చేందుకు అధికారులు.. 30 వేల రూపాయల ఖర్చుచేసి కొండముచ్చును తెప్పించారు. కొండముచ్చును విధులలో తిప్పుతూ కోతుల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్లాన్ చేశారు. మరి ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
Also read:
Road Accident: ట్రాక్టర్ కింద పడ్డా బ్రతికి బయటపడ్డారు.. కారణం ఆ ఒక్కటే..
Hero MotoCorp: కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న హీరో ద్విచక్ర వాహనాల ధరలు.. ఎంతంటే..!
Viral Video: సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్.. దొంగను పట్టుకునేందుకు పోలీస్ పరుగులు