Mohan Babu: కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన.. సీఎం జగన్‌ను కలిసే అవకాశం

విజయవాడకు చేరుకున్నారు టాలీవుడ్‌ దిగ్గజ నటుడు మోహన్‌బాబు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికారు అభిమానులు.

Mohan Babu: కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన.. సీఎం జగన్‌ను కలిసే అవకాశం
Mohan Babu

Updated on: Nov 27, 2021 | 9:31 AM

విజయవాడకు చేరుకున్నారు టాలీవుడ్‌ దిగ్గజ నటుడు మోహన్‌బాబు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. ఐతే ఆత్మీయులను కలిసేందుకే విజయవాడ వచ్చానని..ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారాయన. ఏపీ అధికా భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్‌బాబు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కూడా కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

 

కాగా గత కొంతకాలంగా మోహన్ బాబుకు సీఎం జగన్ కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. ఇక ఇటీవల మోహన్ బాబు తనయుడు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. ఇటీవల సినిమాల  విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం చేయాలని నిర్ణయించారు. బెనిఫిట్ షోలను రద్దు చేశారు. కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవేళ మోహన్ బాబు.. సీఎం  జగన్‌ను కలిస్తే ఈ విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

Also Read: Telangana: కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయమ్మ.. పాపం చిట్టి తల్లి

ఈ వీడియో మీ మనసులను తాకుతుంది.. చిట్టి తల్లి మనసు ఎంత పెద్దదో